అంతర్జాతీయం

శే్వతసౌధంలో ఒంటరిగా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, డిసెంబర్ 25: ప్రపంచంలోని క్రైస్తవులందరూ క్రిస్మస్ పండగను వేడుకగా జరుపుకుంటుంటే, శే్వతసౌదాధిపతి, అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ మాత్రం వైట్‌హౌస్‌లో ఏకాకిగా గడిపారు. అత్యంత సంపన్న దేశం అమెరికా అధినేత ట్రంప్ ఇలా ఒంటరిగా తన కార్యాలయానికి పరిమితమై ఉండడానికి కారణముంది. క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఎక్కడికి వెళ్లకుండా అన్ని కార్యక్రమాలను ట్రంప్ రద్దు చేసుకున్నారు. ఇంతకీ ట్రంప్ క్రిస్మస్ రోజు వైట్‌హౌస్‌కే ఎందుకు పరిమితమయ్యారు? ఏ వేడుకులకు వెళ్లకపోయినా ఊరికే ఉన్నారా అంటే అదీ లేదు. తన రాజకీయ ప్రత్యర్థులైన డెమోక్రాట్లను నిశితంగా విమర్శిస్తూ ట్వీట్లు చేశారు. అమెరికాలోకి మెక్సికన్లు, ఇతర దేశస్థులు చొరబడకుండా సరిహద్దుల్లో గోడ నిర్మిస్తామని ట్రంప్ ఎన్నికల్లో హామీ ఇచ్చారు. గెలిచిన తర్వాత ఆ గోడ నిర్మాణానికి పూనుకున్నారు. అయతే అందుకు ఐదు బిలియన్ డాలర్ల ఖర్చవుతుంది.. ఇంత పెద్ద మొత్తం ఖర్చుపెట్టేందుకు వీలు లేదని, పైగా గోడలెందుకని డెమాక్రట్లు ఎదురుతిరిగారు. దీంతో ట్రంప్ ఆలోచనలకు బ్రేక్‌పడ్డాయి. గత శుక్రవారం నుంచి ట్రంప్ ఏ విధంగానైనా గోడ నిర్మించేందుకు అవసరమైన చట్టసభల అనుమతి సంపాదించేందుకు కసరత్తు చేస్తున్నారు. కాని డెమోక్రాట్లు సహకరించడంలేదు. అమెరికా ఆర్థిక వ్యవస్థను రక్షించాలంటే తప్పనిసరిగా గోడ కట్టాల్సిందేనని ట్రంప్ వాదన. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ గోడ నిర్మాణం పూర్తయిన తర్వాత ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌తో భేటీ కావాలని ట్రంప్ యోచిస్తున్నారు. కిమ్‌ను కలుసుకోవడం, చర్చించాల్సిన అంశాలపై కసరత్తు కూడా చేశారు. ఉన్నతాధికారులు కిమ్‌తో చర్చలు జరపడంపై ట్రంప్‌కు ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. దేశ భద్రత, ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు డెమోక్రాట్లు మొండివైఖరి విడనాడి సహకరించాలని ట్రంప్ పదే పదే కోరారు. కాగా వాషింగ్టన్‌లోని క్రిస్మస్ సర్వీసు ప్రార్థనలకు ట్రంప్, ఆయన భార్య హాజరయ్యారు. అంతకుముందు క్రిస్మస్ తాతకు చిహ్నంగా ఉన్న శాంతాట్రాకర్ వద్ద పిల్లలతో ట్రంప్ దంపతులు ముచ్చటించారు. క్రిస్మస్ వేడుకలు, హాబీలు, వివిధ అంశాలపై పిల్లల ఆసక్తిని అడిగి తెలుసుకున్నారు.