అంతర్జాతీయం

విపత్తులు.. విలయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీడ్కోలు 2018

ఏ సంవత్సరంలోనైనా వీడని పీడకలలా వెంటాడే జ్ఞాపకాలు ఎన్నో ఉంటాయి. వాటి ప్రభావం ఆయా దేశాలపైనా, ప్రజలపైనా తీవ్రంగానే ఉంటుంది. ఉప్పెనల నుంచి సునామీల వరకు అంత్యరుద్ధాల నుంచి కరవుకాటకాల వరకు ప్రకృతి వైపరీత్యాలు మనిషి స్వయంకృతం కారణంగా చోటు చేసుకునే సంక్షోభాలు ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తాయి. భరించలేని సంక్షోభాన్ని నిలువ నీడలేని పరిస్థితులను కలిపిస్తాయి. మరికొన్ని రోజుల్లో ముగుస్తున్న 2018లో ఇలాంటి విపత్తులు సంభవించాయి. వాటి ప్రభావం ఏళ్లూ, కూళ్లూ గడిచినా తీరేది కాదు.
నీడ లేని రోహింగ్యాలు
ఉన్నదేశంలో ఉండలేక మరోదేశంలో మనుగడ సాగించలేక రోహింగ్యా ముస్లిం శరణార్థులు భూతల నరకాన్ని అనుభవిస్తున్నారు. మైన్మార్ నుంచి లక్షల సంఖ్యలో ఈ శరణార్థులు పొరుగున వున్న బంగ్లాకు తరలివచ్చి అక్కటి శరణార్థ శిబిరాల్లోనే తలదాచుకున్నారు. వీరిని వెనక్కి పంపేందుకు బంగ్లా, మైన్మార్ వద్ద ఒప్పందం కుదిరింది కానీ, శరణార్థులు మాత్రం స్వదేశానికి వెళ్లేందుకు ససేమిరా అంటున్నారు. మైన్మార్‌లోని రఖీనా రాష్ట్రానికి తమను పంపిస్తే నరకంలోకి నెట్టేసినట్టేనన్న వారి బాధను, ఆవేదనను అర్థం చేసుకునేదెవరు? వెనక్కి రమ్మంటున్నా మైన్మార్‌కి వెళ్లలేక బంగ్లాదేశ్‌లోనే శరణార్థ శిబిరంలో ఉండలేక రోహింగ్యాలు పడుతున్న కష్టం పాశానన్నయినా కరిగించేది. ఈ శరణార్థుల్లో ఎక్కువ మంది పిల్లలే ఉండటం మరింత బాధాకరం.
తగ్గని సిరియా సెగ
మానవాళి చరిత్రలో అంతూ పొంతూలేదు. మానవ సంక్షోభం సిరియా. దశాబ్దాలుగా సాగుతున్న అంతర్యుద్ధ పరిస్థితులు బెంబేలెత్తిస్తున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేక వర్గాలకు మధ్య జరుగుతున్న ఘర్షణలు సిరియాను కకావికలం చేస్తున్నాయి. అనునిత్యం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతికే పరిస్థితే. దీని ప్రభావం దేశంలో సగానికి పైగా వున్న పిల్లల భవితపైనే తీవ్రంగా పడుతోంది. ఇప్పటికే లక్షా 60 వేల మంది విదేశాలకు పారిపోయారు. దేశంలోనే మరో 62 లక్షల మందికి ఎలా మనుగడ సాగించాలో తెలియని పరిస్థితి. వీరందరికీ ప్రామాణికమైన జీవనాన్ని, ఆరోగ్యాన్ని అందించడం పెద్ద సమస్యగానే మారుతోంది. కొత్త ఏడాదిలోనైనా సిరియా సంక్షోభానికి తెరపడి అక్కడి బాల్యం వికసిస్తుందని ఆశిద్దాం.
వైపరీత్యాల నెలవు ఇండోనేషియా
ఇండోనేషియాను అనేక ప్రకృతి వైపరీత్యాలు బీభత్సాలు నిలువునా కుదిపేశాయి. తాజాగా 280 మందిని బలిగొన్న అగ్ని పర్వత కారక సునామీ ఇందుకు పరాకాష్ఠ అయితే ఈ ఏడాది అంతా ఇండోనేషియా పౌరులు ప్రకృతి విలయాల్లో విలవిలలాడారు. భూకంపాలకు బెంబేలెత్తిపోయారు. సెప్టెంబర్ 28న సంభవించిన 7.5 తీవ్రత కలిగిన భూకంపం పెను సునామీకి కారణమై దాదాపు రెండు వేల మందిని బలిగొంది. అనూహ్య రీతిలో విధ్వంసానికే కారణమైంది. దాదాపు 15లక్షల మంది ఆ ప్రభావం నుంచి ఇంకా కోలుకోకముందే తాజా బీభత్సం ఇండోనేషియా ప్రజల గుండెలను పిండేస్తోంది.
అన్నమో రామచంద్రా..!
మానవాళి చరిత్రలో ఎన్నడూ లేనంతగా తీవ్ర స్థాయిలో తూర్పు ఆఫ్రికాను ఆకలి మంటలు దహించి వేస్తున్నాయి. ప్రస్తుత ఏడాదిలోనే దేశ జనాభాలో సగానికి పైగా అంటే 28 మిలియన్‌ల మంది ప్రజల పరిస్థితులు అత్యంత దయనీయంగా మారాయి. ఓ పక్క ఆకలి మంటలు.. మరో పక్క క్షామ పరిస్థితులు సిరియాను మానవీయ సంక్షోభంలోకి నెట్టేశాయి. ఎడతెగని సంఘర్షణలు, నిరంతర కరవు కాటకాలు, మామూలు మనిషికి అందుబాటులోలేని ఆహార పదార్థాల ధరలు తూర్పు ఆఫ్రికా ప్రజల వెన్ను విరుస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో తిరుగుబాటు దారులతో ప్రభుత్వం శాంతి ఒప్పందం కుదుర్చుకున్నా ఇప్పటికే నిర్వాసితులైన లక్షలాది మంది పరిస్థితి అగమ్యంగా మారింది. ఓ పక్క ఎక్కడికి పారిపోవాల్సి వస్తుందోనన్న భయం, సొంత క్షేత్రాల్లోనే వ్యవసాయం చేసుకోలేని అభద్రత తూర్పు ఆఫ్రికా ఆహార సంక్షోభానికి మరింత ఆజ్యం పోస్తోంది.
కకావికలం కాంగో
కాంగోను ఇటు అంటు వ్యాధులు.. అటు ఆకలి మంటలు మరోవైపు పౌష్ఠికాహార లోపం చిధ్రం చేస్తోంది. ఎబోలా వ్యాధి ఈ దేశ పిల్లలను నిర్వీర్యంగా మారుస్తోంది. ఈ ఏడాది ఈ మానవీయ సంక్షోభం మరింత తీవ్రమైంది. ప్రపంచ దేశాలు ఎంతగా ఆదుకున్నా ఎడతెగని అంతర్యుద్ధం కాంగోను కకావికలం చేస్తోంది.