అంతర్జాతీయం

మితిమీరిన సైనిక చర్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జూలై 11: కాశ్మీర్‌లో భారత సైన్యం అణచివేత చర్యలకు పాల్పడుతోందని పాకిస్తాన్ తీవ్రస్థాయిలో ఆరోపించింది. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హన్ వని ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. పౌరులపై మితిమీరిన స్థాయిలో సైనిక చర్యలకు భారత్ ఒడిగడుతోందని పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆరోపించారు. భారత్ సైనిక చర్యను ఖండిస్తూ ఒక ప్రకటన జారీచేశారు. అదేవిధంగా ముంబయ పేలుళ్ల కుట్రదారు హఫీజ్ సయాద్ నేరుగానే భారత్‌పై ధ్వజమెత్తాడు. వీరిద్దరూ కాశ్మీర్‌పై వ్యాఖ్యలు చేయడం అన్నది తీవ్రస్థాయలో ఆందోళనకు కారణమవుతోంది. కాశ్మీర్ అల్లర్లకు ఆజ్యం పోయడమే వీరి లక్ష్యమన్న ఆరోపణలు తీవ్రమవుతున్నాయ.
బుర్హన్‌తోపాటు అనేకమంది పౌరులు కూడా ఈ పారామిలిటరీ దళాల చర్యల్లో మరణించడం పట్ల షరీఫ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు పాకిస్తాన్ ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది. ఈ రకమైన చర్యల వల్ల కాశ్మీర్ ప్రజల ఆకాంక్షను అణచివేయలేరని, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానం ప్రకారం వారు ఉత్తమ స్వయం నిర్ణయాధికారాన్ని సాధించుకోగలుగుతారన్న అభిప్రాయాన్ని షరీఫ్ వ్యక్తం చేశారు. భారతదేశం మానవ హక్కుల పరిరక్షణ పట్ల తన నిబద్ధతను చాటుకుని ఐరాస తీర్మానాలకు కట్టుబడాలని షరీఫ్ కోరారు. అనేకమంది కాశ్మీర్ వేర్పాటువాద నాయకులను భారత ప్రభుత్వం అరెస్టు చేయడం సమంజసం కాదన్నారు. ఇప్పటికే సయ్యద్ అలీషా జిలానీ, మిర్వాయిజ్ ఒమర్ ఫరూక్, మహ్మద్ యాసిన్ మాలిక్ వంటి వేర్పాటువాద నాయకులను భారత ప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకుంది.