అంతర్జాతీయం

అమెరికా అధ్యక్ష పదవికి పెరుగుతున్న పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి 2020లో జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తానని అమెరికా కాంగ్రెస్‌కు డెమాక్రటిక్ పార్టీ నుంచి ఎన్నికైన తొలి హిందువుతులసి గబ్బార్డ్ ప్రకటించారు. వచ్చే వారంరోజుల్లో తన అభ్యర్థిత్వంపై అధికారికంగా ప్రకటించనున్నట్లు ఆమె చెప్పారు. డెమాక్రటిక్ పార్టీ తరఫున చాలా మంది అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. భారత సంతతికి చెందిన కాలిఫోర్నియా సెనెటర్ కమల హరీస్ కూడా అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. తాను నాలుగుసార్లు అమెరికా కాంగ్రెస్‌కు డెమాక్రటిక్ పార్టీ నుంచి ఎన్నికైనట్లు తులసి గబ్బార్డ్ తెలిపారు. అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు తనకు అన్ని అర్హతలు ఉన్నాయని ఆమె చెప్పారు. ప్రతి అమెరికా పౌరుడికి ఆరోగ్య సదుపాయాలు, బీమా పాలసీ బెనిఫిట్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆమె చెప్పారు. సమగ్ర ఇమ్మిగ్రేషన్ విధానాన్ని తెస్తానన్నరు. పరిశుభ్రమైన నీరు, గాలి అందించేందుకు వీలుగా పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు. నేర న్యాయ వ్యవస్థను సరైన దారిలో పెట్టనున్నట్లు చెప్పారు. రానున్న రోజుల్లో మీడియాతో తన భావాలను పంచుకుంటానని చెప్పారు. అధ్యక్ష పదవికి తాను ఎందుకు పోటీపడుతున్నానో తెలియచేస్తూ ట్వీట్ చేశారు. అమెరికన్ ప్రజల సహకారం కావాలని కోరారు. అమెరికాలోని సమావో ప్రాంతంలో ఆమెజన్మించారు. ఆమె హిందూమతంలోకి మారారు. అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడనున్న తొలి హిందువు తులసి కావడం విశేషం. అమెరికాలో స్థిరపడిన భారతీయుల్లో తులసికి పాపులారిటీ ఉంది. ఒక వేళ కాలం కలిసి వచ్చి ఎన్నికల్లో గెలిస్తే అమెరికా అధ్యక్ష పదవిని అలంకరించిన తొలి క్రైస్తవేతర వ్యక్తి, హిందూ మహిళ కావడం నిజంగా రికార్డే. అమెరికా జనాభాలో హిందువుల జనాభా ఒక శాతం కంటే తక్కువ. హవాలీ నుంచి ఆమె నాల్గవ సారి అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికయ్యారు. 2020 నవంబర్‌లో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతాయి. ట్రంప్ మరోసారి ఎన్నిక కావాలనికోరుకుంటున్నారు. ఈ దిశగా ట్రంప్ తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. క్రిమినల్ జస్టిస్,హెల్త్ కేర్ రంగాల్లో మంచి మార్పులు తెస్తానని తులసి అంటున్నారు. అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు జోయ్ బిడన్ కూడా తాను 2020 ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. సెనెటర్లు కిర్‌స్టెన్ గిల్లీ బ్రాండ్, అమీ క్లోబూచర్, టిమీ కైనేలు కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సమాయత్తమవుతున్నారు.