అంతర్జాతీయం

పొగబెడుతున్న షట్‌డౌన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 13:అధికార రిపబ్లికన్‌లు, ప్రతిపక్ష డెమొక్రాట్ల మధ్య విభేదాల కారణంగా తలెత్తిన ప్రభుత్వ స్తంభన అమెరికా ఆర్థిక వ్యవస్థను క్రమంగా కమ్ముకుంటోంది. అగ్ర రాజ్య చరిత్రలో గతంలోనూ షట్‌డౌన్ పరిస్థితి తలెత్తినా ఇంత దీర్ఘకాలం పాటు సాగిన దాఖలాలు లేవు. దాదాపు రెండు వారాలు గడుస్తున్నా అధికార, విపక్షాలు పట్టు వీడక పోవడంతో షట్‌డౌన్ ప్రభావం ఆర్థిక వ్యవస్థలోని ఇతర రంగాలకూ వ్యాపిస్తోంది. 1976 నుంచి ఇప్పటి వరకూ ఇలాంటి పరిస్థితి 21సార్లు తలెత్తినా దాని వల్ల ఆర్థిక కార్యకలాపాలకు ఎలాంటి విఘాతం కలుగలేదు. కారణం..స్వల్ప వ్యవధిలోనే ఆ సమస్య పరిష్కారమైపోయింది. ఇంత తీవ్ర స్థాయిలో, దీర్ఘకాలం పాటు అమెరికా ఆర్థిక వ్యవస్థ నిధుల లేమి పరిస్థితిని ఎదుర్కోవడం ఇదే మొదటిసారి. తక్షణ ప్రాతిపదికన సమస్యను పరిష్కరించే చర్యలు చేపట్టకపోతే షట్‌డౌన్ ప్రభావం ఎంత తీవ్రంగానైనా ఉండవచ్చునని, దాన్ని అంచనా వేయలేమని నిపుణులు అంటున్నారు. మొదట్లో స్వల్పంగానే సమస్యలు తలెత్తినా రోజురోజుకూ అవి విస్తరిస్తున్నాయని, దీని ప్రభావం అన్ని రంగాలను చాలా బలంగానే తాకుతోందని అంటున్నారు. వారానికి 1.2బిలియన్ డాలర్ల మేర దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటిల్లుతోందని, మూడో వంతు ప్రభుత్వ ఉద్యోగులూ దెబ్బతిన్నారని ఎస్ అండ్ పి గ్లోబల్ రేటింగ్స్ ఆర్థికవేత్త అన్ బావినో పేర్కొన్నారు. ఇలాగే పరిస్థితి కొనసాగితే మాత్రం ఆర్థిక నష్టం అంచనాలకు అందనంత పెరిగిపోయే ప్రమాదం కూడా ఉందని ఆయన హెచ్చరించారు. ప్రస్తుత రేట్లతో పోలిస్తే రెండు వారాల్లోనే షట్‌డౌన్ వల్ల కలిగే నష్టం 5.7బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని తెలిపారు. మెక్సికో నుంచి వలసలను అరికట్టేందుకు అధ్యక్షడు ట్రంప్ సరిహద్దు పొడవునా గోడ కట్టాలను కోవడం..దాన్ని ప్రతిపక్ష డెమొక్రాట్లు వ్యతిరేకించడంతో ఈ పరిస్థితి తలెత్తింది.