అంతర్జాతీయం

మమ్మల్ని గెంటేయండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుండర్‌లాండ్, జనవరి 13: ఐరోపా యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగే విషయంలో రోజురోజుకూ తలెత్తుతున్న వివాదం బ్రెగ్జిట్ అనుకూల వర్గాల్లో తీవ్ర అసహనానికి కారణమవుతోంది. ఐరోపా యూనియన్ నుంచి తప్పుకోవాలంటూ ఓటేసిన సుండర్‌లాండ్ ప్రజలు ఎంపీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐరోపా యూనియన్ నుంచి బ్రిటన్‌ను గెంటేయండి అన్న స్థాయిలో ఈ పట్టణ ప్రజలు విరుచుకు పడుతున్నారు. ఒకప్పుడు బ్రిటన్‌లో షిప్‌బిల్డింగ్ నగరంగా గణతికెక్కిన ఈ ప్రాంతంలోని నిసాన్ కారు నిర్మాణ కర్మాగారం లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. ఐరోపా యూనియన్ నుంచి వైదొలగాలన్న నిర్ణయానికి ఈ పట్టణమే వెనె్నముకగా నిలిచింది.61శాతం మంది బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఓటేశారు. అయితే బ్రెగ్జిట్ అనుకూల, ప్రతికూల వర్గాల మధ్య తేడా స్వల్పం కావడంతో అసలు సమస్య తలెత్తింది. బ్రిటన్ ప్రధాని ధెరీసా మే ఏమీ చేయలేని డైలమాలో పడిపోయారు. ఈ విషయంలో మంగళవారం ఎంపీలు తీసుకునే నిర్ణయం కీలకం కాబోతోంది. ఇది బ్రెగ్జిట్‌కు అనుకూలమా, ప్రతికూలమా అన్నదానిపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. సుందర్‌లాండ్ నగర వాసులు మాత్రం సాధ్యమైనంత త్వరగా ఐరోపా యూనియన్ నుంచి బ్రిటన్‌కు విముక్తి కలిగించాలన్న పట్టుదలతో ఎంపీలపై వత్తిడి పెంచుతున్నారు.