అంతర్జాతీయం

అఫ్ఘాన్ కు భారత్ బాసట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమర్కండ్ (ఉజ్బెకిస్థాన్): నిత్యం యుద్ధం, అశాంతితో కునారిల్లుతున్న అఫ్ఘానిస్థాన్ దేశం ఆర్థిక పునర్నిర్మాణానికి భారతదేశం తన పూర్తి సహాయ సహకారాలు అందజేస్తుందని భారత్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు. అఫ్ఘాన్ దేశాన్ని మార్గదర్శకంగా, నియంత్రిత, స్వయంసమృద్ధి దేశంగా తీర్చిదిద్దడానికి తాము కట్టుబడి ఉన్నామని ఆమె అన్నారు. చారిత్రాత్మకమైన భారత్-మధ్య ఆసియా దేశాల చర్చల్లో భాగంగా ఆమె మొదటి ప్రసంగం చేస్తూ ఉగ్రవాదం ద్వారా తమ ప్రాంతాలకు ఎదురయ్యే సవాళ్లపై ప్రత్యేకంగా దృష్టిపెట్టామని చెప్పారు. మధ్య ఆసియా, అఫ్ఘానిస్థాన్ వీటివల్ల ఎక్కువగా నష్టపోతున్నాయని ఆమె చెప్పారు. సమాజంలో ఉగ్రవాదులకు చోటులేకుండా చేయాలన్నదే తమ ఆలోచన అని ఆమె స్పష్టం చేశారు. అసలు ఈ ఉగ్రవాదులు ఎవరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? వారికి నిధులు ఎవరు సమకూరుస్తున్నారు? వారిని ఎవరు ప్రోత్సహిస్తున్నారు? ఎవరు మద్దతు ఇస్తున్నారు వంటి ప్రశ్నలను ఈ సందర్భంగా అడగదల్చుకున్నానని అన్నారు. ఉగ్రవాదంతో బాధపడుతున్న ఏ దేశంలోకీ పెట్టుబడులు రావని, వాణిజ్య వృద్ధి ఎంతమాత్రం ఉండదని ఆమె స్పష్టం చేశారు. తమ రీజన్‌లో వాణిజ్య వృద్ధి జరగాలంటే ఉగ్రవాదంపై ఉమ్మడిగా పోరాటం చేయాలన్న అంశాన్ని అంగీకరిస్తామన్నారు. ఒకదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో ఉగ్రవాదం పూర్తిగా తుడిచిపెట్టుకుపోవాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు. అఫ్ఘానిస్తాన్‌తో తమ సంబంధం పటిష్టం కావాలంటే అందులో అభివృద్ధి అంశం కూడా ముడిపడి ఉందని, అందుకే అభివృద్ధి అంశాలకు తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఆమె తెలిపారు. అందుకే తాము ఆసియాదేశాలన్నింటితో అభివృద్ధిలో భాగస్వాములవుదామని భావిస్తున్నామని, అన్నిదేశాలతో అనుభవాలను, సాంకేతికతను, అభివృద్ధిని పంచుకోవాలని అనుకుంటున్నామని ఆమె చెప్పారు. తమ దేశం అన్ని దేశాలతో భౌగోళికంగా కూడా అనుకూలంగా ఉందని, మూడు నాలుగు గంటల్లో విమానయానం ద్వారా తమదేశానికి చేరుకోవచ్చునని ఆమె అన్నారు. మనం ఇప్పుడు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని నూతన ఆవిష్కరణలు, పరిష్కారాలను కనుగొందామని ఆమె పిలుపునిచ్చారు.
మధ్య ఆసియా దేశాలతో మరింత విస్తృతంగా భాగస్వాములయ్యేందుకు ‘ఇండియా-సెంట్రల్ ఆసియా డెవలప్‌మెంట్ గ్రూప్’ను ఏర్పాటు చేసే యోచనలో భారత్ ఉందని ఆమె ప్రకటించారు. భారత్, ఇరాన్, అఫ్ఘానిస్తాన్ సంయుక్త ప్రయత్నాల వల్ల ఇరాన్‌లోని చాబహర్ పోర్టు అభివృద్ధి చెంది అఫ్ఘానిస్తాన్‌తో కనెక్టివిటీ ఏర్పడిందని, తద్వారా మధ్య ఆసియా ప్రాంతంలో రవాణా, ఇతర రంగాలు అభివృద్ధి చెందుతాయని సుష్మా తెలిపారు. మనకున్న ఆటంకాలను సంయుక్త భాగస్వామ్య కృషి ద్వాలా ఎలా అధిగమించవచ్చు అన్నదానికి ఉదాహరణే చాబహర్ పోర్టు అభివృద్ధి అని ఆమె వ్యాఖ్యానించారు.