అంతర్జాతీయం

ఫెడరల్ ఉద్యోగులకు ఉచిత భోజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హ్యూస్టన్, జనవరి 16: అమెరికాలో నాలుగో వారానికి చేరుకున్న పాక్షిక షట్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న తోటి ఉద్యోగులకు సిక్కు మతస్థులు తమ వంతుగా వారికి ఉచిత భోజన సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. టెక్సాస్, సాన్ ఆంటోనియా ప్రాంతాలలో షట్‌డౌన్ వల్ల జీతం లేక ఉచితంగా విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి తమ వంతుగా ఈనెల 11 నుంచి ఉచిత భోజనాన్ని ఏర్పాటు చేసినట్టు సాన్ ఆంటోనియాలోని సిక్కు సెంటర్ అధ్యక్షుడు బల్విందర్ థిల్లాన్ తెలిపారు. తమ వంతు సాయంగా తమ తోటి ఉద్యోగులకు వేడివేడి శాకాహార భోజనాన్ని తమ గురుద్వార్‌ల ద్వారా అందిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఇప్పటికే షట్‌డౌన్ వల్ల ఇబ్బందులను పడుతున్న ఉద్యోగులను ఆదుకోవడానికి అమెరికాలోని పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చాయని, తాము కూడా తమ వంతుగా వారికి ఉచిత భోజన సౌకర్యాన్ని కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. ఇలావుండగా, మెక్సికో సరిహద్దు వద్ద అక్రమ చొరబాటుదారులు అమెరికాలో ప్రవేశించకుండా అక్కడ గోడ నిర్మించాలని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుబడుతుండగా, 5.7 బిలియన్ డాలర్లతో గోడ కట్టి ప్రజాధనాన్ని వృథా చేయడానికి తాము అంగీకరించమని విపక్ష డెమోక్రాట్లు భీష్మించారు. దీంతో తమ డిమాండ్ అంగీకరించే వరకు ఎలాంటి నిధులు విడుదల చేసేది లేదని ట్రంప్ పేర్కొంటూ పాక్షిక షట్‌డౌన్‌కు పూనుకోవడంతో దేశంలోని 8 లక్షల మంది ఫెడర్ ప్రభుత్వ ఉద్యోగులు జీతభత్యాలు లేకుండానే ఉచితంగా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పాక్షిక షట్‌డౌన్ నాలుగో వారానికి చేరుకోవడంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోవడమే కాక, ఉద్యోగులకు జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.