అంతర్జాతీయం

అమెరికా హెల్త్‌కేర్ స్కాంలో భారత్ డాక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హౌస్టన్, జనవరి 16: అమెరికాలో అతి పెద్ద హెల్త్‌కేర్ స్కాంలో భారత సంతతికి చెందిన ఇండో అమెరికా డాక్టర్ , పద్మశ్రీ గ్రహీత డాక్టర్ రాజేంద్ర బోత్రాకు అమెరికా జిల్లా కోర్టు ఏడు మిలియన్ డాలర్ల బాండ్‌పైన విడుదల చేసింది. డాక్టర్ రాజేంద్రపై అమెరికా పోలీసులు 464 మిలియన్ డాలర్ల హెల్త్ కేర్ స్కాంలో కేసు నమోదు చేశారు. బాండ్‌పై డాక్టర్ రాజేంద్రను విడుదల చేయడాన్ని ప్రభుత్వం వ్యతిరేకించింది. బెయిల్‌పై విడుదల చేయడం వల్ల రాజేంద్ర దేశాన్ని విడిచి పారిపోతారని కూడా ప్రభుత్వం వాదించింది. బాండ్‌పై రాజేంద్రను విడుదల చేస్తూ జడ్జి స్టీఫెన్ మర్ఫీ ఆదేశాలు జారీ చేశారు. ఈ వివరాలను డెట్రాయిట్ న్యూస్ ఏజన్సీ ప్రకటించింది. ఆయన బ్లూమ్‌ఫీల్డ్ హిల్స్‌లో ఉంటున్నారు. అమెరికా చరిత్రలో ఇంత పెద్ద హెల్త్‌కేర్ స్కాం నమోదు కాలేదని పోలీసులు చెప్పారు. రిటైర్డయిన తర్వాత తనకు వచ్చే బెనిఫిట్ 8.5 బిలియన్ డాలర్లను పూచీకత్తుగా కోర్టుకు రాజేంద్ర సమర్పించారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు మూడు రోజులు పడుతుంది. ఈ విచారణకు రాజేంద్ర భార్య, కుమార్తె హాజరయ్యారు. వీరు తమ పాస్‌పోర్టులను కూడా కోర్టుకు సమర్పించారు. బోత్రా కు భారత్‌తో సంబంధాలు ఉన్నాయని, పెట్టుబడులు పెట్టారని, ఆస్తులు ఉన్నాయని అమెరికా దర్యాప్తు సంస్థ కోర్టుకు తెలిపింది . బోత్రా ఇండియన్ అమెరికన్ రిపబ్లికన్ పార్టీలో నిధుల సేకరణలో కీలకపాత్రవహించారు. 1980, 1990 దశకంలో ఆయన జార్జి హెచ్ డబ్ల్యు బుష్, ఇతర రిపబ్లికన్ చట్టసభ్యులకు నిధులను సేకరించడంలో చురుకైన పాత్ర పోషించినట్లు పోలీసులు చెప్పారు. సంవత్సరానికి ఎనిమిది వారాల పాటు ఆయన భారత్‌కు వచ్చి ఇక్కడ ఉచితంగా వైద్య సేవలు అందిస్తుంటారు. ఇంకా వైద్య కళాశాలల్లో ఉపన్యాసాలు ఇస్తుంటారు. నర్గీస్ దత్ ఫౌండేషన్‌కు ఆయన పనిచేశారు. పొగాకు సేవించడం, హెచ్‌ఐవీ ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టేందుకు ఆయన విశేషంగా కృషి చేశారు. బోత్రాకు 35 మిలియన్ డాలర్ల ఆస్తులు ఉన్నట్లు ప్రాసిక్యూటర్లు చెబుతున్నారు. బోత్రాకు మెట్రో డెట్రాయిట్‌లో 22 ఆస్తులు ఉన్నట్లు అమెరికా అటార్నీ బ్రాండీ మెక్ మిలియన్ చెప్పారు.