అంతర్జాతీయం

ఐరాసలో సంస్కరణలు తేవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్యసమితి, జనవరి 17: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు వేగవంతమవుతాయనే ఆశాభావంతో ఉన్నట్లు ఐరాస అధ్యక్షుడు మారియా ఫెర్నాండా ఎస్పీనోసా అన్నారు. బలమైన రాజకీయ సంకల్పం లేకుండా ప్రగతిని సాధించడం సంక్లిష్టమన్నారు. గత ఏడాది ఐరాస 73వ సదస్సులో ఆయన అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. ఆమె గతంలో ఈక్వెడార్ దేశంలో విదేశాంగశాఖ మంత్రిగా పనిచేశారు. ఈ ఏడాది నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు ప్రపంచదేశాలు సహకరించాలన్నారు. భద్రతా మండలిలో మార్పులు, చేర్పులు, విధి విధానాల్లో సంస్కరణలు తేవాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఈ దిశగా అజెండా ఖరారు చేసేందుకు చర్యలు తీసుకుంటామనన్నారు. ఈ ఏడాది ఈ అంశంపై ప్రధాన దేశాల అధినేతలతో చర్చిస్తామన్నారు. ఈ అంశంపై బహిరంగంగా ఇప్పటికిప్పుడు మాట్లాడలేమని, కాని అంతరంగికంగా చర్చలను వేగవంతం చేసినట్లు ఆమె చెప్పారు. ఐరాసలో సంస్కరణలు రావాలని అన్ని దేశాలు 25 ఏళ్లుగా కోరుకుంటున్నాయన్నారు. కాని ఒక్క అడుగు కూడా ముందుకేయలేకపోతున్నామన్నారు. ఐరాసలో మార్పులు రావాలని తీర్మానం చేసిన సమయంలోతాను అంబాసిడర్‌గా ఉన్నానని చెప్పారు. అన్ని దేశాల్లో అధినేతలు, విదేశాంగ విధానాల్లో రాజకీయపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. భద్రతా మండలిలోసంస్కరణలు వేగవంతం చేయాలని పోరాడుతున్నదేశాల్లో భారత్ ముందంజలో ఉందన్నారు. 21వ శతాబ్ధం అవసరాలకు తగ్గట్టుగా ఐరాసను తీర్చిదిద్దాలన్నారు. శాశ్వత, తాత్కాలిక సభ్యత్వంపై సభ్యుల సంఖ్యను విస్తరించాలన్నారు.