అంతర్జాతీయం

ఆరోగ్య సమాజంగా మారుతున్న ప్రపంచం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 17: ఆరోగ్యపరిరక్షణకు గత 20 సంవత్సరాలుగా పెద్దయెత్తున నిధులు కేటాయిస్తుండటంతో ప్రపంచం ఆరోగ్య సమాజంగా పెనుమార్పు చెందుతోందని, అమెరికాకు చెందిన ప్రముఖ దాత, బిల్‌గేట్స్ సతీమణి మెలిందా గేట్స్ గురువారం తెలిపారు. బిల్, మెలిందా గేట్స్ ఫౌండేషన్ అంతర్జాతీయ సమావేశం అనంతరం ఆమె మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, తన భర్త బిల్‌గేట్స్‌తో కలిసి ఆమె విలేఖరులతో మాట్లాడుతూ భారత్, ఇండోనేషియా, వియత్నాం వంటి దేశాలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి బాటలు వేసుకుంటున్నాయని, దీంతో సహజంగానే ప్రజల జీవన స్థితిగతులు మెరుగయ్యాయని ఆమె అన్నారు. 1990 తర్వాత మరణాల శాతం కూడా తగ్గిందని ఆమె చెప్పారు. తాను, తన భర్త బిల్‌గేట్స్ ఆశావాదులమని ఆరోగ్యవంతమైన సమాజాన్ని చూడాలన్నది తమ కోరికని ఆమె అన్నారు. 2000 సంవత్సరం నుంచి ప్రపంచదేశాలు మనిషి ఆరోగ్యపరిరక్షణపై దృష్టిసారించాయని, దానిపై ఎక్కువ శాతం నిధులు కేటాయించడంతో ఆరోగ్యకరమైన సమాజం తయారవుతోందని అన్నారు. తాను, బిల్‌గేట్స్ కలిసి ప్రపంచంలోని పలు దేశాల్లో పర్యటించి స్థానికులతో మాట్లాడేటప్పుడు 1990 వరకు ప్రజలు హెచ్‌ఐవీ, మీజిల్స్, మలేరియా వంటి వ్యాధుల బారిన పడి మృతి చెందేవారని, ఇప్పుడు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని వివరించారన్నారు. పోలియో మహమ్మారి వ్యాధి గురించి ప్రపంచవ్యాప్తంగా పెద్దయెత్తున ప్రచారం సాగడంతో ఇంచుమించు అది నిర్మూలమైనట్టేనని ఆమె అన్నారు. ఇప్పటివరకు గ్లోబల్ ఫండ్ ద్వారా ఎయిడ్స్, టీబీ, మలేరియా వంటి వ్యాధులపై పోరాటం సాగిందని, ఇప్పుడు శిశు, ప్రసవ మరణాలను తగ్గించడంపై దృష్టి సారిస్తున్నారని తెలిపారు. 1999 నుంచి తమ ఫౌండేషన్ 10 బిలియన్‌ల యూఎస్ డాలర్లను కేవలం ఆరోగ్య పరిరక్షణకే ఖర్చు చేసినట్టు ఆమె వివరించారు. తాము ఖర్చు చేస్తున్న నిధులకు తగిన ప్రతిఫలాన్ని తాము చూస్తున్నామని, తమ సహాయం భవిష్యత్‌లో కూడా ఇలాగే కొనసాగుతుందని ఆమె తెలిపారు.