అంతర్జాతీయం

ఐఎస్ కమాండర్ ఒమర్ హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగ్దాద్, జూలై 14: ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాద సంస్థ కీలక ఉగ్రవాది ఒమర్ అల్- షిసానీ హతమైనట్లు ఐఎస్ ధ్రువీకరించింది. షిసానీని అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ ‘యుద్ధ మంత్రి’గా అభివర్ణించేది. ఇరాక్‌లోని మోసుల్ నగరానికి దక్షిణంగా ఖరయత్ పట్టణం సమీపంలో జరిగిన వైమానిక దాడుల్లో ఒమర్ మరణించినట్లు ఉగ్రవాదులకు చెందిన ‘అమక్’ వార్తాసంస్థ ఐసిస్ వర్గాలనుటంకిస్తూ వెల్లడించింది. ఐఎస్ ఉగ్రవాదుల అధీనంలో ఉన్న మోసుల్ నగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇరాక్ దళాలు ప్రయత్నించిన సమయంలో ఒమర్ మరణించి ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే అమక్ వార్తాసంస్థ సైతం ఒమర్ ఎప్పుడు, ఎలా మరణించాడనే విషయాన్ని తెలియజేయలేదు. ఒమర్ మరణాన్ని గుర్తు చేసుకుంటూ, అతని ఫోటోలుంచుతూ ఐసిస్ మద్దతుదారులు పలువురు గతంలో ఆన్‌లైన్‌లో వ్యాఖ్యలు చేసినప్పటికీ ఐసిస్ మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. గత మార్చిలో సిరియాలో తాము జరిపిన వైమానిక దాడిలో ఒమర్ మరణించినట్లు భావిస్తున్నామని అప్పట్లో అమెరికా ప్రకటించింది. ఆ దాడిలో ఒమర్ గాయపడ్డాడే తప్ప చనిపోలేదంటూ అప్పుడు ఐఎస్ ప్రకటించింది. అయితే గతంలో ఒమర్ మరణవార్తలను ఖండించిన ఐఎస్ ఇప్పుడు అతను మరణించినట్లు ధ్రువీకరించడం గమనార్హం.