అంతర్జాతీయం

దోపిడీకి గురవుతున్న హెచ్-1బి వీసా ఉద్యోగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 17: అమెరికాలో హెచ్-1బి వీసాపై పనిచేస్తున్న ఉద్యోగులలో చాలామంది సరైన పనివాతావరణం మధ్య ఉద్యోగం చేయడం లేదని, వారు దోపిడీకి గురవుతున్నారని ఈ విషయంలో ప్రభుత్వం పలు సంస్కరణలు తీసుకురావాలని, ముఖ్యంగా జీతాల పెంపు, పనివాతావరణం మెరుగుపర్చడం వంటివి వెంటనే చేపట్టాల్సిన అవసరం ఉందని అమెరికాకు చెందిన ఒక అధ్యయన సంస్థ పేర్కొంది. ముఖ్యంగా హెచ్-1బి వీసాపై పలువురు భారతీయ ఐటి నిపుణులు, ఇతరులు అమెరికాలో ఎక్కువగా పనిచేస్తున్న నేపథ్యంలో సౌత్ ఆసియా సెంటర్ ఆఫ్ ది అట్లాంటిక్ కౌన్సిల్ (్థంక్-ట్యాంక్) వెల్లడించిన నివేదికలో ఉద్యోగులకు మంచి పని వాతావరణం కల్పించాలని, వారికి హక్కులు కూడా ఇవ్వాలని సూచించింది. హెచ్-1బి వీసాదారులకు తగిన ప్రాధాన్యత ఇస్తామని, వారికి అమెరికా పౌరసత్వం కల్పిస్తామంటూ కొన్నిరోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తమకు నిపుణుల అవసరం ఉందని, వారికి తమ దేశం ఎప్పుడూ ఆహ్వానం పలుకుతుందని, హెచ్-1బి వీసా ఉన్నవారు సులభంగా తమ దేశ పౌరసత్వాన్ని కూడా పొందవచ్చునని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతమున్న వీసావిధానం అమెరికా పౌరులకే కాక, దీనిపై వచ్చి ఇక్కడ పనిచేస్తున్న ఇతర దేశస్థులకు కూడా హాని చేస్తోందని నివేదికలో పేర్కొన్నారు. వారు చేస్తున్న పనికి తగిన వేతనం లభించడం లేదని, తరచూ మంచి పని వాతావరణం లేని చోట పనిచేయాల్సి వస్తోందని నివేదికలో తెలిపారు. దీనిని అధిగమించడానికి ప్రభుత్వం వారికి పనికి తగ్గ వేతనాలు ఇవ్వాలని, మంచి పని వాతావరణం సృష్టించాలని అప్పుడే ఇతర దేశస్థులతో పాటు అమెరికన్ల జీవితాలు సైతం మరింత మెరుగవుతాయని, పేర్కొంది. దీనివల్ల అమెరికాలో నిపుణుల కొరత భర్తీ అయ్యి దేశం ఆర్థికంగా మరింత అభివృద్ధిని సాధిస్తుందని అన్నారు.