అంతర్జాతీయం

అమెరికాలో ముదురుతున్న గోడ వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 18: అమెరికా ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో ఉన్న నేతల మధ్య అభిప్రాయబేధాలు ముదురుతున్నాయి. దేశంలో ఆర్థిక పరిస్థితి బాగాలేదనే కారణంపై స్పీకర్ నాన్సీ పెలోసీ బ్రస్సెల్స్, ఆఫ్గనిస్తాన్ పర్యటనలకు అనుమతి లభించలేదు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ప్రకటించారు.
గోడ వివాదంతో రిపబ్లికన్లు, డెమాక్రట్ల మధ్య దూరం పెరిగింది. దీంతో స్పీకర్ నాన్సీ పర్యటనకు ట్రంప్ నో అన్నారు. దేశంలో ఫెడరల్ కార్యాలయాల్లో 27 రోజులుగా ఉద్యోగులు విధులకు హాజరు కాని పరిస్థితి తలెత్తింది. హౌస్ ఆఫ్ రిప్రెజెంటేటివ్‌లో డెమాక్రట్లకు ఆధిక్యత ఉంది. మెక్సికో, అమెరికా సరిహద్దుల మధ్య 5.7 బిలియన్ డాలర్ల విలువ చేసే గోడకు డెమాక్రట్ల ఆమోదం తెలపడంలేదు. ఈ గోడ నిర్మాణం వృథా అంటున్నారు. ప్రభుత్వంలో పరిస్థితులు బాగాలేవని, అందుకే మీ ప్రయాణానికి అనుమతి ఇవ్వడం లేదని స్పీకర్ నాన్సీకి ట్రంప్ సందేశం ఇచ్చారు. పైగా ఈ విషయం చెప్పేందుకు నిరాకరిస్తున్నట్లు తెలిపారు.
ఉద్యోగులు విధులకు హాజరైన తర్వాత తాను విదేశీ పర్యటనకు అనుమతి ఇస్తానని ట్రంప్ పేర్కొన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో సంక్షోభం నుంచి ఎలాబయటపడాలో వాషింగ్టన్‌లో ఉండి ప్రభుత్వానికి సహకరించాలని ట్రంప్ స్పీకర్ నాన్సీని కోరారు. నాన్సీ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడం సమంజసమైన చర్యని ఇందులో ఎటువంటి దురుద్దేశ్యాలు ట్రంప్ అన్నారు. అలాగే దావోస్‌లోని ప్రపంచ ఎకనామిక్ ఫోరంకు కూడా అమెరికా ప్రతినిధుల బృందాన్ని పంపడంలేదని వైట్ హౌస్ పేర్కొంది. 27 రోజులుగా 8లక్షల మంది ఉద్యోగులు విధులకు హాజరుకాకపోవడంతో ప్రభుత్వంలో ప్రతిష్టంభన ఏర్పడింది.