అంతర్జాతీయం

వ్యాధుల నిర్ధారణకు ఎంజైమ్ పరీక్ష!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జనవరి 18: వ్యాధుల నిర్ధారణ, చికిత్స వ్యయం పెరిగిపోతున్న నేపథ్యంలో పరిశోధకులు అతి తక్కువ ఖర్చుతో అన్ని రకాల వ్యాధులను నిర్ధారించే ఓ ప్రక్రియను వెలుగులోకి తెచ్చారు. తక్కువ ఖర్చు కావడమే కాకుండా చాలా వేగంగా పనిచేసే ఈ ఎంజైమ్ పరీక్ష ద్వారా వ్యాధులను కచ్చితంగా నిర్ధారించ వచ్చని, బ్యాక్టీరియా పరమైన దోషాలను లోపరహితంగా గుర్తించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. యూకేలోని క్వీన్స్ యూనివర్శిటీకి చెందిన శాస్తవ్రేత్తలు ఈ దిశగా పరీక్షలు జరిపి అనుకున్న ఫలితాలను సాధించారని మనుషులు, జంతువులకు సంబంధించి వ్యాధులను నిర్ధారించడంతోపాటు ఆహారపదార్థాల్లో కూడా కాలుష్యాన్ని ఈ పరీక్ష ద్వారా పసిగట్టవచ్చని స్పష్టం చేశారు. ప్రోటియాసీస్‌గా పేర్కొనే ఈ ఎంజైమ్ మార్కర్లను ఈ పరీక్ష ద్వారా నిర్ధారించ వచ్చని చెబుతున్న శాస్తవ్రేత్తలు ‘మానవ శరీరంలో అతి సూక్ష్మజీవుల వృద్ధికి ప్రోటియాసిస్ కారణమవుతోంది. అంతేకాకుండా అనేక వ్యాధు లు ప్రబలం కావడానికి ఇదే మూలం’అని తమ పరిశోధన పత్రంలో వెల్లడించారు. కిడ్నీ వ్యాధిగ్రస్తుల మూత్రలో ప్రోటీయాసిస్ స్థాయి అధికంగా ఉంటుందని, అదే విధంగా అంటువ్యాధులకు దారితీసే గాయాల్లో కూడా ఇది ఎక్కువగా కనిపిస్తుందని చెప్పారు. ప్రస్తుతం ప్రోటీయాసిస్ నిర్ధారణ పద్ధతులు అత్యంత వ్యయంతో కూడినవిగా ఓపట్టాన తేలనివి కావడంతో ఈ ఎంజైమ్ పరీక్షా విధానాన్ని తాము అభివృద్ధి చేసినట్టు తెలిపారు. పైగా ప్రస్తుతం ఉన్న వ్యాధి నిర్ధారణ విధానాలు కచ్చితంగా రోగాలను గుర్తించే పరిస్థితి లేదని వెల్లడించిన పరిశోధకులు ‘మేం రూపొందించిన నానో సెన్సార్ ద్వారా ప్రోటీయాస్‌ను వేగంగా, కచ్చితంగా నిర్ధారించవచ్చు. లేబొరెటరీ పరిస్థితులకు అతీతంగానే ఈ వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరపవచ్చు’అని క్వీన్స్ వర్శిటీ ప్రొఫెసర్ క్లెయిర్ మెక్‌వీ వెల్లడించారు.