అంతర్జాతీయం

పోర్టుల అభివృద్ధి దిశగా చైనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 18: హిందూ మహాసముద్రంలో సైనికాధిపత్యం కోసం చైనా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. సముద్రతీర ప్రాంతా ల్లో పోర్టులను మరింత అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నిస్తోంది. ఇందుకు అనుగుణంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగేందుకు కసరత్తులు ప్రారంభిస్తోంది.
పాకిస్తాన్‌లోని గ్వాదర్, శ్రీలంకలోని హమ్‌బ్యాన్‌టోటా ప్రాంతాల్లో పోర్టులను అభివృద్ధి చేసే దిశగా చైనా వ్యూహాత్మంగా ముందుకు వెళ్తోందని పెంటగాన్ తెలిపింది. ఆయా ప్రాంతాల్లో తమ సైనిక పాటవాన్ని మరింత బలపరచుకునేందుకు తద్వారా అన్నింటా ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తోంది. ఆఫ్రికాతోపాటు దక్షిణాసియా, మధ్యప్రాచ్య దేశాలతో సముద్రతీర ప్రాంతాల్లో సరకు రవాణాతోపాటు సైనిక పాటవాన్ని మరింత పెంపొందించేందుకు కృషి చేస్తోంది. పోర్టుల అభివృద్ధి కోసం చైనా చేస్తున్న ప్రయత్నాల గురించి, తద్వారా చైనా సాయుధ సంపత్తిని మరింత శక్తివంతం చేసుకుంటున్న అంశాలపై అమెరికాకు చెందిన రక్షణ వ్యవహారాల శాఖ తెలిపింది. ది పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీ (పీఎల్‌ఏఎన్) సైతం వాణిజ్య పోర్టులతోపాటు పౌర విమానయాన రంగాల్లో సైతం అంతర్జాతీయపరంగా, దేశీయంగా రవాణారంగాల్లో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి. స్పార్ట్‌లీ, పారాసెల్ దీవుల్లో ప్రధాన రవాణా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు వీలుగా దక్షిణ చైనా సముద్రతీర ప్రాంతాలను విరివిగా ఉపయోగించుకోనుందని ఆ వర్గాలు తెలిపాయి.
కొలంబో పోర్టుకు 1.5 బిలియన్లు..
ప్రపంచంలోని వివిధ దేశాల్లో పోర్టుల అభివృద్ధి దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న చైనా తాజా భారీ ఎత్తున నిధులు వెచ్చించి కొలంబోలో పోర్టు సిటీ ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టింది.
ఇందుకు అనుగుణంగా కొలంబో పోర్టు ఏర్పాటుకు 1.5 బిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నట్టు చైనా రాయబార వర్గాలు బుధవారం వెల్లడించాయి. 269 ఎకరాల విస్తీర్ణంలో కొలంబోలో భారీ ఎత్తున పోర్టు ఏర్పాటు చేయనున్న విషయమై చైనా రాయబారి చెంగ్ జుయుయాన్ ఇక్కడ జరిగిన ఒక సమావేశం సందర్భంగా పేర్కొన్నారు. శ్రీలంక ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూర్చే భారీ ప్రాజెక్టు నిర్మాణంలో చైనా కీలక పాత్ర పోషించనుందని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటు వల్ల 4000 మంది శ్రీలంక పౌరులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని, ఇప్పటికే తాము 700 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టామని ఆయన పేర్కొన్నారు.
అంతర్జాతీయపరంగా ఎలాంటి మార్పులు జరిగినా, చైనా మాత్రం ఇరుదేశాల మధ్య సంబంధ బాంధవ్యాలను మరింత మెరుగుపరచేందుకు కృషి చేస్తుందని ఆయన తెలిపారు. తాము అనుకున్న సమయం 28 నెలల కంటే 3 నెలల ముందుగానే ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.