అంతర్జాతీయం

ట్యాంకర్, బస్సు ఢీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, జనవరి 22: పాకిస్తాన్‌లోని బలూచీస్తాన్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ ఆయుల్ ట్యాంకర్, ప్రయాణికుల బస్సును ఢీకొన్న దుర్ఘటనలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. లాస్‌బెలా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. 40 మంది ప్యాసింజర్లతో బస్సు కరాచీ నుంచి పంజ్‌గూర్ వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఆయుల్ ట్యాంకర్ ఢీకొంది. దీంతో ట్యాంకర్‌లో మంటలు లేచాయి. ట్యాంకర్‌లో ఇరానియన్ డీజిల్ ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. ట్యాంకర్ మంటలు కాస్తా బస్సుకూ విస్తరించాయి. ఈ దుర్ఘటనలో 27 మంది సజీవ దహనమయ్యారు. కొందరు బస్సు నుంచి దూకేసి ప్రాణాలు కాపాడుకున్నారని వారు తెలిపారు. ఆయుల్ ట్యాంకర్, బస్సు దగ్ధమయ్యాయి. ప్రమాద స్థలం నుంచి 27 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. అందరూ శరీరం కాలిపోయే మృతి చెందినట్టు లాస్‌బెలా డిప్యూటీ కమిషనర్ షాబీర్ మెంగల్ చెప్పారు. ప్రమాదంలో 16మంది తీవ్రంగా గాయపడగా, అందులో ఆరుగురి పరిస్థతి విషమంగా ఉంది. అంబులెన్స్ తదతర సౌకర్యాలు అందుబాటులోలేకపోవడం వల్ల క్షతగాత్రులను కరాచీ ఆసుపత్రికి తరలింపులో జాప్యం చోటుచేసుకుంది. రహదారులు అస్తవ్యస్తంగా ఉండడం, డ్రైవర్ల మితిమీరిన వేగం ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అలాగే బలూచీస్తాన్ సరిహద్దు రాష్ట్రం కావడంతో ఆయుల్ అక్రమంగా రవాణా జరుగుతోంది. ఈ ప్రాంతంలో రోడ్ ప్రమాదాలకు ఏటా వందలాది మంది చనిపోతున్నారు.