అంతర్జాతీయం

ఐఎస్ ఆధీనంలోని గ్రామం స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీరుట్, జనవరి 23: సిరియాలో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ఆధీనంలో ఉన్న ఒక గ్రామాన్ని ఎస్‌డిఎఫ్ నేతృత్వంలోని ఖుర్దీష్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. బుధవారం కాలిపట్‌లోని సరిహద్దును దాటిన ఈ దళాలు ఐఎస్ ఆధీనంలో ఉన్న అతి ముఖ్యమైన రెండు గ్రామాలను స్వాధీనం చేసుకున్నట్టు అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. గత ఏడాది అమెరికా సహకారంతో సిరియాలోని ఇరాన్ సరిహద్దుకు సమీపంలో ఉభ్న యుపరేట్స్ వాలీలో అధికంగా ఉన్న జిహాదీలను సిరియన్ డెమోక్రాటిక్ ఫోర్సు (ఎస్‌డిఎఫ్) అణచివేసింది. వ్యవసాయ భూమి అధికంగా ఉన్న బాగౌజ్ గ్రామాన్ని ఆక్రమించుకుని తిష్టవేసిన జీహాదీలను బుధవారం ఎస్‌డిఎఫ్ దళాలు తరిమికొట్టాయి. చాలామంది పారిపోగా, వేలాది మంది లొంగిపోయారు. గ్రామంలో మహిళలు, వృద్ధులు, పిల్లలు కలిసి 4900 మంది ఉండగా, వీరిలో ఐఎస్ ఉగ్రవాదులు 470 మంది వరకు ఉన్నారని, వీరిలో 3500 మంది ముందుగానే లొంగిపోయారని అధికార ప్రతినిధి అబ్దుల్ రెహమాన్ తెలిపారు. వీరిని ట్రక్కులు, ఇతర వాహనాల ద్వారా తరలించి గ్రామాన్ని ఖాళీ చేయించినట్టు ఆయన చెప్పారు. కాగా, ఇటీవలే ఐఎస్ ఆధీనంలో ఉన్న హాజిన్ పట్టణం, ఆల్-షాఫా, సౌస గ్రామాలను తమ దళాలు స్వాధీనం చేసుకున్నాయని ఆయన తెలిపారు. గత ఏడాది డిసెంబర్ నుంచి సుమారు 27 వేల మంది ఐఎస్ ఉగ్రవాదులు, సానుభూతిపరురు వారి ప్రాంతాలకు తరలిపోయారని, 1800 మంది జిహాదీలు లొంగిపోయారని చెప్పారు. 2014 నుంచి ఎడతెరపి లేకుండా తాము చేస్తున్న దాడుల వల్ల సిరియా నుంచి పొరుగున ఉన్న ఇరాక్, బాగ్దాది ప్రాంతాలకు జీహాదీలు పరారయ్యారని ఆయన వివరించారు. కాగా, తీవ్రవాదం వల్ల తీవ్రంగా నష్టపోయిన సిరియాకు అండగా అమెరికా అండగా నిలిచింది. దాంతో యూఎస్ దళాలతో కలిసి ఎస్‌డిఎఫ్‌కు చెందిన ఖుర్దీష్ దళాలు ఉగ్రవాదంపై ఉమ్మడిపోరు నిర్వహించడంతో ఆ దేశం ఇప్పుడిప్పుడే ఉగ్రవాదుల ఆధిపత్యం నుంచి బయటపడుతోంది. కాగా, తమ దళాలను ఉపసంహరించుకుంటున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యపరిచింది.