అంతర్జాతీయం

ప్రకృతి విపత్తుల ముప్పుపై పోరాటానికి అనాసక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దావోస్, జనవరి 24: వాతావరణంలో సంభవించే తీవ్రమార్పుల కారణంగా ప్రపంచానికి ఏర్పడే ముప్పును ఎదుర్కోవడంలో సంయుక్తంగా పోరాడే విషయంలో వివిధ దేశనేతల్లో చిత్తశుద్ధి తగ్గుతూ వస్తోందని, చాలామంది దీనిపై అనాసక్తిగా ఉన్నారని, ఇది ప్రమాదకర ధోరణి అని ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటోనియా గుటెర్సస్ హెచ్చరించారు. ఇక్కడ జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో ఆయన మాట్లాడుతూ తన ఉద్దేశంతో సమీప భవిష్యత్‌లో ప్రకృతి విపత్తుల ముప్పు ప్రపంచానికి పొంచి ఉందని చెప్పారు. అయితే మనం దానిని ఎదుర్కొనే రేసులో వెనుకబడిపోతున్నామని, వాతావరణంలో మార్పులు అతివేగంగా జరుగుతుండగా, దానిని ఎదుర్కొనే దిశగా మనం సనద్ధం కాలేకపోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలను ఎదుర్కోవడానికి మనకు వాణిజ్య రంగం నుంచి, ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నా రాజకీయ నేతల నుంచి మాత్రం ఆశించిన స్పందన రావడం లేదని అన్నారు. అసలు వాతావరణం నుంచి మనకు ముప్పుందా అని కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారని, తన ఉద్దేశంలో రానున్న కాలంలో వాతావరణంలో సంభవించే పెనుమార్పుల కారణంగా ప్రపంచంలో విపత్తులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ఆయన అన్నారు.