అంతర్జాతీయం

కరవు కాటకాలను ఎదుర్కోవడంలో భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐరాస, జనవరి 24: కరవు కాటకాలను ఎదుర్కోవడంతో భారతదేశం అత్యంత ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తోందని ఐక్యరాజ్య సమితి సదస్సు స్పష్టం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న ప్రతికూల ధోరణులను ఎదుర్కొనేందుకు భారతదేశం తీసుకుంటున్న చర్యలను ఇతర దేశాలు ఆదర్శంగా తీసుకోవాలని హితవుపలికింది. ఐరాసకు చెందిన ఈ విభాగం కార్యదర్శి మొనిక్ బార్బట్ ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే సదస్సు ఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో అక్టోబర్ 7, 8 తేదీల్లో జరుగుతుందని ప్రకటించారు. 169 దేశాల నుంచి 120 మంది ప్రతినిధులు హాజరైన ఈ సదస్సులో 2000 సంవత్సరం నుంచి నిస్సారమైపోతున్న భూమి పరిరక్షణ గురించి కూలంకషంగా చర్చించారు. అంతర్జాతీయంగా ఏర్పడుతున్న ప్రతికూల ఫలితాలు.. వాటిని ఎదుర్కొనేందుకు అవసరమైన పరిజ్ఞానంపై సూచనలు సలహాలు ఇచ్చిపుచ్చుకున్నారు. ఇండియాలో కరవు కాటకాలు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు వాటిని ఎదుర్కొన్న తీరు మిగతా దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని ఈ సందర్భగం బార్బట్ పేర్కొన్నారు. ఇలాంటి సవాళ్లను ఎదుర్కోవాలంటే భారత్ నేతృత్వంలో పనిచేయాల్సిన అవసరం ఉందని సూచించారు.