అంతర్జాతీయం

ఇదేమి చోద్యం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్ , జనవరి 25: తమ దేశ విస్కీపై భారత్‌తో అత్యధికంగా 150 శాతం వరకు దిగుమతి సుంకాలు విధించడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పుపట్టారు. అమెరికాకు చెందిన ప్రఖ్యాత మోటార్ సైకిల్ హార్లీ డేవిడ్‌సన్‌లను భారత్‌కు ఎగుమతి చేసిన సందర్భంగా తాను రెండు నిమిషాలపాటు సంబంధిత అధికారులతో మాట్లాడి, సుంకంలో ఊరట కల్పించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గత ఏడాది ఫిబ్రవరిలో హార్లీ డేవిడ్‌సన్ బైక్‌లను ఎగుమతి చేసిన సందర్భంగా అప్పటివరకు ఉన్న 100 శాతం సుంకాన్ని 50 శాతం వరకు తగ్గించానని ఆయన తెలిపారు. అదేవిధంగా భారత్ నుంచి అమెరికాకు దిగుమతి చేసుకునే బైక్‌ల విషయంలోనూ సుంకాన్ని తగ్గించేందుకు తాను కృషి చేసిన విషయాన్ని పరస్పర వాణిజ్య చట్టంపై జరిగిన ఒక కార్యక్రమం సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన వాణిజ్యేతర రంగాలకు సుంకాలు తగ్గిస్తూ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు ఆయన తెలిపారు. అయితే, చాలా దేశాలు అమెరికా అలసత్వాన్ని ఆసరా చేసుకుని చేస్తున్న చర్యలను ఆయన తప్పుపట్టారు. ముఖ్యంగా భారత్‌లో మోటార్ సైకిళ్లపై 100 శాతం ఉన్న సుంకాన్ని 50 శాతం తగ్గించానని, ఇది ఇప్పటికీ అలాగే కొనసాగుతోందని, తమ దేశానికి ఎగుమతి అవుతున్న వాహనాలపై 2.4 శాతం సుంకం విధిస్తున్న విషయాన్ని ఆయన పేర్కొన్నారు. భారత్‌తో వాణిజ్యపరంగా తాము ఎంతో సహకరిస్తున్నామని, కానీ తమ దేశానికి చెందిన విస్కీపై దిగుమతి సుంకం 150 శాతం ఉందని అన్నారు. ఈ ఒక్క విషయంలో తప్ప భారత్‌తో తాము అన్ని విషయాల్లోనూ వివిధ ఒప్పందాల్లో నిజాయితీగా వ్యవహర్తిస్తున్నామని ఆయన తెలిపారు. వాణిజ్య ఒప్పందాల విషయంలో తాము స్నేహపూర్వకంగా, పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని, అయితే, కొన్ని దేశాలు ఆ దిశగా ప్రయత్నించడం లేదని అంటూ ఇకనైనా ఇలాంటి ధోరణులకు ముగింపు పలకాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హితవు పలికాడు. ఇలాంటి పరిస్థితుల్లో జరుగుతున్న పరస్పర వాణిజ్య చట్ట సదస్సుల్లో అందరికీ తగిన పరిష్కార మార్గాలు లభిస్తాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.