అంతర్జాతీయం

అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ ఉన్నవారికే ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 31: అమెరికా దేశం తన కొత్త హెచ్-1బి వీసా విధానాన్ని ప్రకటించింది. వీటి నిబంధనలు ఏప్రిల్ నుంచి అమలులోకి వస్తాయని వెల్లడించింది. దీని ప్రకారం అమెరికాలోని యూనివర్సిటీల నుంచి అడ్వాన్స్‌డ్ డిగ్రీలు ఉన్న విదేశీయులకు ఈ వీసా మంజూరులో ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది.
ఈ నిర్ణయం భారత్, చైనా దేశాల నుంచి పెద్దయెత్తున ఇక్కడకు వచ్చిన విద్యార్థులు, నిపుణులపై తీవ్ర ప్రభావం చూపనుంది. భారత్ నుంచి ఐటీ ప్రొఫెషనల్స్ సాధారణంగా ఈ హెచ్-1బి నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాపై ఇక్కడకు వస్తుంటారు. పలు కంపెనీలు కూడా వీరిని ఈ వీసాపైనే ఇక్కడకు రప్పిస్తుంటారు. వీరంతా నిపుణులని, ఉత్తమ విద్యార్హతలు ఉన్నాయని వీరు చెబుతుంటారు. అయితే కొత్త వీసా నిబంధనలు వీటికి బ్రేక్ వేసే సూచనలున్నాయి. ఏప్రిల్ ఒకటి నంచి అమలు కాబోయే ఈ విధానం ప్రకారం యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్ (యూఎస్‌సీఐఎస్) హెచ్-1బి కోసం వచ్చే దరఖాస్తులను నిశితంగా పరిశీలిస్తుంది. దీని నిమిత్తం ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్‌ను సైతం ప్రవేశపెడుతున్నారు. ఇది కంపెనీలకు, ఉద్యోగులకు ఉపయోగకారిగా ఉంటుందని యుఎస్‌సిఐఎస్ డైరెక్టర్ ప్రాన్సిస్ సిస్సనా తెలిపారు. హెచ్-1బి వీసా నిబంధనలను సవరించాలని అనుకుంటున్నామని, ఈ వీసా ఉన్నవారికి అమెరికా పౌరసత్వం కూడా లభిస్తుందని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
ఈ నేపథ్యంలోనే దీనిని ప్రకటించామని, దీనిని ఒకసారి కనుక అమలుచేస్తే ఎంప్లాయర్ల ఖర్చులు తగ్గడమే దేశం పనితీరు మరింత మెరుగవుతుందని అన్నారు. దీని ప్రకారం యూఎస్‌లో ఉన్న కంపెనీలు ఉద్యోగులను నియమించాలని అనుకుంటే అభ్యర్థులు అప్పటికే యూఎస్‌లో మాస్టర్స్ లేదా హయ్యర్ డిగ్రీ కలిగి ఉంటే వారికి హెచ్-1బి వీసా మంజూరులో అత్యధిక ప్రాధాన్యత లభిస్తుంది. మొదట వీరిని ఎన్నిక చేసిన తర్వాతే మిగిలిన వారికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఈ చర్య ద్వారా అమెరికా నుంచి మాస్టర్స్ డిగ్రీ ఉండి వీసాలు పొందే వారి సంఖ్య 16 శాతం పెరుగుతుందని ఆయన వివరించారు.