అంతర్జాతీయం

ఎన్పీటీపై సంతకం పెట్టాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, జనవరి 31: అణ్వస్త్ర వ్యాప్తినిరోధక ఒప్పందం (ఎన్పీటీ)పై సంతకం చేయని దేశాలకు అణు సరఫరాదారుల బృందంలో సభ్యత్వం ఇచ్చిన సంప్రదాయం గతంలో లేదని చైనా స్పష్టం చేసింది. గతంలో ఎన్పీటీపై సంతకం చేయని దేశాలకు సభ్యత్వం ఇచ్చిన సంప్రదాయం లేదన్నారు. భారత్ ఎన్పీటీపై సంతకం చేయని విషయం విదితమే. కాగా అణు సరఫరాదారుల బృందంలో భారత్ చేరికను చైనా వ్యతిరేకిస్తోంది. చైనా, రష్యా, అమెరికా, బ్రిటన్,ఫ్రాన్స్‌దేశాలు ఎన్పీటీపై సంతకం చేయకపోయినా, అణు సరఫరాదారుల బృందంలో సభ్యత్వం ఉండడం గమనార్హం. అణు సరఫరాదారుల బృందం సమావేశం ఇక్కడ రెండు రోజుల పాటు జరిగింది. ఈ బృందంలో 48 దేశాలు ఉన్నాయి. ఈ సమావేశంలో జరిగిన వివరాలను చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జెంగ్ షూంగ్ విలేఖరులకు తెలిపారు. ఈ సమావేశానికి ప్రాధాన్యత ఉందని ఆయన చెప్పారు. ప్రపంచదేశాలను అణ్వస్తర్రహిత దేశాలుగా మార్చడంపై చర్చ జరిగినట్లు చెప్పారు.
అంతర్జాతీయంగా శాంతి, భద్రత సాధనకు కట్టుబడి ఉండాలని తీర్మానించినట్లు చెప్పారు. ఎన్పీటీ విధి విధానాలను యదాతథంగా అమలు చేస్తామన్నారు. ఇందులో ఎటువంటి మార్పులు ఉండవన్నారు. ఎన్పీటీ విధి విధానాలకు కట్టుబడి ఉన్న దేశాలకే అణు సరఫరాదారుల బృందంలో సభ్యత్వం ఇవ్వడం కుదురుతుందన్నారు. దౌత్య విధానాల ద్వారా ప్రపంచ దేశాలు అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకాలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. పాకిస్తాన్ కూడా అణు సరఫరాదారుల బృందంలో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసిన విషయం విదితమే.