అంతర్జాతీయం

వాళ్లతో చర్చలు టైమ్‌వేస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఫిబ్రవరి 2: దేశానికి అక్రమ వలసల నిరోధం, గోడ నిర్మాణంపై వెనకడుగువేసేది లేదని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం పునరుద్ఘాటించింది. అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం లభించకపోయినా తనకున్న విశేష అధికారాలను వినియోగించి గోడ నిర్మాణం చేయాలని అధ్యక్షుడు నిర్ణయించారు. అవసరమైతే జాతీయ ఎమర్జెన్సీని ప్రకటించాలని ట్రంప్ భావిస్తున్నారు. దక్షిణ మెక్సికో సరిహద్దు నుంచి అమెరికాలోకి వెల్లువెత్తుతున్న అక్రమ వలసను అరికట్టి దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత తనకుందని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్‌వ్యూలో ఆయన వెల్లడించారు. ‘ఫేస్ ద నేషన్’ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ అవసరమైనే విపత్తుల పురావాస నిధుల నుంచి డబ్బులు తీసుకొచ్చయినా మెక్సికో గోడ నిర్మిస్తానని ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష డెమాక్రాట్లపై ట్రంప్ విరుచుకుపడ్డారు. డెమాక్రాట్లతో చర్చలు శుద్ద దండగ అని వ్యాఖ్యానించారు. ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.‘ ఫెలోసీ ఓ పట్టాన వినే మనిషి కాదు. అన్నింటినీ రాజకీయాలు చేస్తోంది’అని ట్రంప్ విమర్శించారు. నాన్సీ మారుతుందని తాము ఆశించామని అయితే ఫలితం లేకపోయిందని అధ్యక్షుడు చెప్పారు. ఫెలోసీ వల్ల దేశానికి ఎంతో నష్టం అంటూ ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు.‘నిజం చెప్పాలంటే ఆమె సరిహద్దును తెలిచి ఉండాలనే కోరుకుంటారు.మానవ అక్రమ రవాణా, దేశ భద్రత ఆమెకు పట్టవు’అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వందలు,వేల మంది అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్నా నాన్సీ ఫెలోసీ పట్టదని మరోసారి విరుచుకుపడ్డారు.