బిజినెస్

ఐడీబీఐలో వాటాల తగ్గింపునకు ఎల్‌ఐసీకి కాలపరిమితేమీ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 3: ఐడీబీఐ బ్యాంక్‌లో అత్యధిక శాతం వాటాలు కలిగివున్న ఎల్‌ఐసీ ఇప్పటికిప్పుడే అందులో 15 శాతం వాటాను తగ్గించుకునేందుకు ఎలాంటి కాలపరిమితి విధించలేదని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ) తెలిపింది. ఈ విషయాన్ని ఐఆర్‌డీఏఐ చైర్మన్ సుభాష్ కుంతియా తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఐడీబీఐలో 51 శాతం వాటాలు కలిగిన ఉన్న ఇన్సూరెన్స్ దిగ్గజం కష్టాల్లో మునిగితేలుతున్న ఐడీబీఐ సంస్థ వ్యాపార కార్యకలాపాలు కొనసాగేందుకు వీలుగా 15 శాతం వాటా తగ్గించుకోవాలని సూచించినట్టు ఆయన పేర్కొన్నారు. ‘ఐడీబీఐలో కొంత వాటాను తగ్గించుకోవాలని ఎల్‌ఐసీని కోరాం. అప్పుల ఊబిలో ఉన్న ఆ సంస్థ ఆర్థిక పరిస్థితిని గమనంలోకి తీసుకుని ఎల్‌ఐసీకి ఈమేరకు అనుమతి ఇచ్చాం. అందుకు అనుగుణంగా ఎల్‌ఐసీ 15 శాతం వాటా తగ్గించుకునేందుకు అంగీకరించింది’ అని ఐఆర్‌డీఏ చైర్మన్ పీటీఐ ప్రతినిధికి తెలిపారు. ఐడీబీఐలో వాటాలు కలిగిన ఇన్సూరెన్స్ సంస్థకు ప్రస్తుతం 15 శాతం మాత్రమే వెనుకకు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. వాస్తవానికి ప్రభుత్వ ఆధీనంలో ఎక్కువ శాతం వాటా కలిగివున్న ఎల్‌ఐసీ వంటి సంస్థకు అంతకంటే ఎక్కువ వాటా వెనుకకు తీసుకునేందుకు తగిన పరిమితులు ఉన్నాయని ఆయన అన్నారు. గత ఏడాది జూన్‌లో ఐడీబీఐలో ఎల్‌ఐసీ 51శాతం వాటాలను సం పాదించింది. జనవరి 21 నాటికి ఐడీబీఐ రూ.5,030 కోట్లు ఎల్‌ఐసీ నుంచి అందుకుంది. అదేవిధంగా ఐడీబీఐని కొంతమేరకు టేకోవర్ చేసుకున్న నేపథ్యంలో గతేడాది డిసెంబర్ 28 నాటికి ఎల్‌ఐసీ 14,500 కోట్ల రూపాయలు ఐడీబీఐకి అందజేసింది. ‘ఐడీబీఐ నుంచి వాటాను తగ్గించుకోవడానికి ఎల్‌ఐసీకి ఇప్పటివరకు ఎలాంటి కాలపరిమితి విధించలేదు. ఇందుకు ఎంత సమయం పడుతుందో ఇప్పుడే చెప్పలేం. వారి వ్యాపా ర కార్యకలాపాలకు అనుగుణంగా వాటాల తగ్గింపుపై నిర్ణ యం తీసుకోగలం’ అని ఐఆర్‌డీఏ చైర్మన్ స్పష్టం చేశారు. కొ న్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ సం స్థ కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీల వాటాలను 15 శాతం పెంచుకునేందుకు అనుమతి ఇస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.