అంతర్జాతీయం

వెంటాడుతున్న బ్రెగ్జిట్ భయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగే పక్షంలో ఇంగ్లాండ్‌లో అల్లర్లు చెలరేగితే బ్రిటన్ రాజకుటుంబం భద్రతకు, క్షేమంగా తరలించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఒప్పందం ప్రకారమైతే, వచ్చే నెల 29వ తేదీన బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగాలి. దీనినే బ్రెగ్జిట్ అంటారు. ఇప్పటికే బ్రెగ్జిట్‌పై బ్రిటన్ ప్రభుత్వంలో అనిశ్చితి నెలకొంది. ప్రచ్ఛన్నయుద్ధకాలంలో కూడా సోవియట్ నుంచి దాడి ఎదురైతే, బ్రిటన్ రాజకుటుంబాన్ని క్షేమంగా తరలించడంపై ప్రణాళిక ఖరారైనట్లు ఒక మీడియా కథనం వెలువడింది. సండే టైమ్స్ పత్రిక ఈ కథనాలను ప్రచురించింది. బ్రెగ్జిట్ డెడ్‌లైన్‌లోగా యూరోపియన్ యూనియన్‌తో ఇంగ్లాండ్ ఒప్పందం కుదుర్చుకోని పక్షంలో బ్రిటన్‌లో అల్లర్లు తలెత్తే అవకాశం ఉందని దర్యాప్తు ఏజన్సీలు అనుమానిస్తున్నాయి. ముందు జాగ్రత్తగా బ్రిటన్ రాణి, ఆమె భర్తను లండన్ వెలుపలకు తరలించేందుకు అవకాశం ఉంది. అల్లర్లు తలెత్తితే శాంతి భద్రతల నిమిత్తం స్కాట్‌లాండ్ పోలీసులతో కలిసి సమన్వయంతో పనిచేయాలని లండన్ పోలీసులు ప్రణాళికను ఖరారు చేశారు. కాగా మార్చిలోగా బ్రెగ్జిట్‌నుంచి వైదొలుగుతామనే నిర్ణయంతో ఉన్నట్లు ప్రధాని మే ఇప్పటికే ప్రకటించిన విషయం విదితమే.
కొత్త ఉత్సాహంతో చర్చలు
లండన్: బ్రెగ్జిట్ ఒప్పందంపై యూరోపియన్ యూనియన్ నెగోషియేటర్లతో భేటీ అయినప్పుడు తన వద్ద తమ ప్రజాప్రతినిధులు ఇచ్చిన తాజా తీర్పు, నవీన ఆలోచనలు అనే ఆయుధాలు ఉంటాయని బ్రిటన్ ప్రధానమంత్రి థెరిసా మే ఆదివారం పేర్కొన్నారు. బ్రెగ్జిట్ ఒప్పందాన్ని పునఃచర్చకు పెట్టకూడదని యూరోపియన్ యూనియన్ అధికారులు ఒత్తిడి చేశారు. అయితే బ్రెగ్జిట్ ఒప్పందంలోని సర్వసమ్మతం కాని అవరోధాలను వదిలించుకోవడానికి చేస్తున్న కృషిలో భాగంగా తాను బ్రిటన్, నార్తర్న్ ఐర్‌ల్యాండ్ కోసం పోరాడుతూనే ఉంటానని థెరిసా మే ‘సండే టెలిగ్రాఫ్’లో రాశారు. ‘మేము పరస్పరం కలిసి ఉండి, ఒకే స్వరంతో మాట్లాడితే మేము సరయిన మార్గంలో ముందుకు వెళ్లగలమనే విశ్వాసం నాకు ఉంది’ అని ఆమె పేర్కొన్నారు. ఐర్లాండ్‌తో సరిహద్దు గురించి మాట్లాడకూడదనే ఉద్దేశంతో అవరోధం కల్పిస్తూ నిబంధన పెట్టారు. అయితే, యూరోపియన్ యూనియన్ కస్టమ్స్ నియమాలకు బ్రిటన్ కట్టుబడి ఉండాల్సి వస్తుందని బ్రెగ్జిట్ ఒప్పందానికి మద్దతు ఇస్తున్న వారు భయపడుతున్నారు. ఈ నిబంధనపై తిరిగి చర్చలు జరిపేందుకు థెరిసా మే బ్రసెల్స్‌కు వెళ్లాలనే వైఖరికి అనుకూలంగా గత వారం బ్రిటన్ పార్లమెంటు సభ్యులు ఓటు వేశారు. అప్పుడే బ్రెగ్జిట్ ఒప్పందానికి ఆమోదం లభిస్తుందని సూచించారు. గత నెలలో బ్రిటన్ పార్లమెంటు బ్రెగ్జిట్ ఒప్పందాన్ని దాదాపు తిరస్కరించింది. ‘యూరోపియన్ యూనియన్ వద్దకు బ్రెగ్జిట్ ఒప్పందంపై తిరిగి చర్చించడానికి వెళ్లేందుకు హౌస్ ఆఫ్ కామన్స్‌లో మెజారిటీ ద్వారా ఒక సురక్షితమయిన మార్గం దొరికిందని నాకు ఇప్పుడు విశ్వాసం కలిగింది’ అని థెరిసా మే ‘సండే టెలిగ్రాఫ్’లో రాశారు.