అంతర్జాతీయం

విద్యార్థులందరినీ త్వరలోనే కలుస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్ డీసీ, ఫిబ్రవరి 3: అక్రమ వీసాలతో అమెరికాలో ప్రవేశించారనే అభియోగాలపై అరెస్టయిన భారతీయ విద్యార్థుల విషయంలో భారత ప్రభుత్వ ఒత్తిడి ఫలించిందని అమెరికాలోని భారత రాయబారి హర్శ్‌వర్ధన్ శ్రీంగ్లా ఆదివారం ఇక్కడ తెలిపారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు సోమవారం నాటికి అరెస్టయిన విద్యార్థులలో దాదాపు అందరిని కలుసుకుంటారని ఆయన ధ్రువీకరించారు. ‘మిచిగాన్‌లోని ఫార్మింగ్‌టన్ హిల్స్‌లో గల యూనివర్శిటి ఆఫ్ ఫార్మింగ్‌టన్ నకిలీ యూనివర్శిటి కేసులో చాలా మంది భారతీయ విద్యార్థులు ఇరుక్కోవడం మమ్మల్ని ఆవేదనకు, బాధకు గురిచేస్తోంది. మా విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించడానికి మేము చాలా వేగంగా కదిలి పనిచేస్తున్నాం’ అని శ్రీంగ్లా ఒక వార్తాసంస్థతో ప్రత్యేకంగా మాట్లాడుతూ చెప్పారు. ‘అమెరికా అధికారులు నిర్బంధించిన భారతీయ విద్యార్థులలో మెజారిటీ విద్యార్థులను త్వరలోనే కలుస్తాం లేదా కలవడానికి షెడ్యూలు ఖరారు అవుతుంది’ అని ఆయన తెలిపారు.
విద్యార్థుల భవిష్యత్తుకు ఇబ్బంది కలగొద్దు
అమెరికాలో నిర్బంధానికి గురైన భారతీయ విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగకుండా చూడాలి, వారి భవిష్యత్తుకు ఇబ్బంది కలుగకుండా చూడాలని ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు విదేశీ వ్యవహారాల శాఖకు సూచించారు. అమెరికాలో అరెస్టయిన భారతీయ విద్యార్థులకు ఎలాంటి సమస్య రాకుండా చూసేందుకు సంబంధిత అధికారులతో మాట్లాడాలని ఉప రాష్టప్రతి సెక్రటేరియట్ అధికారులను ఆదేశించారు. అధికారులు ఆదివారం విదేశీ వ్యవహారాల శాఖ అధికారులతో చర్చలు జరిపారు. అమెరికాలో హోంలాండ్ ఆధికారులు అరెస్టు చేసిన విద్యార్థులకు న్యాయం జరిగేలా చూసేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారనేది అడిగి తెలుసుకున్నారు. భారత విద్యార్థుల భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బంది రాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని వెంకయ్య నాయుడు విదేశీ వ్యవహారాల శాఖకు స్పష్టం చేశారు. విద్యార్థులకు సంబంధించిన అన్ని విషయాలను భారత ప్రభుత్వం చాలా జాగ్రత్తగా గమనిస్తోంది.. ఇప్పటికీ నిర్బంధంలో ఉన్న వారిలో 30 మంది విద్యార్థులను స్థానిక భారత కౌన్సిలర్ అధికారులు కలిశారనీ, మిగిలినవారితో మాట్లాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విదేశీ వ్యవహారాల శాఖ అధికారులు ఉప రాష్ట్రపతి కార్యాలయానికి తెలియజేశారు. నిర్బంధంలో ఉన్న విద్యార్థులకు సంబంధించిన సమాచారం, ఇతర వివరాలు అందించేందుకు 24/7 హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయటం జరిగిందని, నిర్బంధంలో ఉన్న విద్యార్థులతోపాటు ఇతర విద్యార్థులకు కూడా న్యాయ సహాయం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని విదేశీ వ్యవహారాల శాఖ అధికారులు ఉపరాష్ట్రపతికి తెలియజేశారు. మోసం చేసిన రిక్రూటర్లను, మోసపోయిన విద్యార్థులను వేరువేరుగా చూడాలని కోరాం.. విద్యార్థుల వివరాలు తెలుసుకుని ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూస్తామని విదేశీ వ్యవహారాల శాఖ అధికారులు ఉప రాష్ట్రపతి కార్యాలయానికి తెలియజేశారు.