అంతర్జాతీయం

మాల్యా అప్పగింతకు లైన్ క్లియర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్: బ్యాంకుల దగా, మనీ ల్యాండరింగ్ కేసుల్లో నిందితుడైన లిక్కర్ వ్యాపారి మిజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు మార్గం సుగమమైంది. వెస్ట్‌మినిస్టర్స్ కోర్టు తీర్పు నేపథ్యంలో ఇందుకు హోం శాఖ కార్యదర్శి ఆమోదం లభించిందని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. మాల్యాను రప్పించేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలు ఈ పరిణామంతో ఓ కొలిక్కి వచ్చినట్టయింది. రెండు దేశాల మధ్య కుదిరిన నేరస్థుల అప్పగింత ఒప్పందం కింద మాల్యాను భారత్‌కు అప్పగించడాన్ని హోం మంత్రి సాజిద్ జావిద్ ఆమోదించాల్సి ఉంది. దీనిపై యూకే హైకోర్టుకు అప్పీలు చేసుకునేందుకు మాల్యాకు 14రోజుల వ్యవధి ఉంది. ఈ విషయంలో ఆయనకు ఊరట లభించే అవకాశాలు చాలా తక్కువే. ఆదివారం నాడే ఇందుకు సంబంధించిన ఉత్తర్వుపై సాజిద్ జావిద్ సంతకం చేశారని హోం శాఖ కార్యాలయ ప్రతినిధి తెలిపారు.