అంతర్జాతీయం

రంగు మారుద్ది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోస్టన్, ఫిబ్రవరి 4: వాతావరణంలో వస్తున్న మార్పులు మావవజాతినే కాదు ప్రకృతిని శాసించే స్థాయి చేరిపోయాయి. వాటి ప్రభావంతో ఎన్నో దుష్ఫలితాలు చూస్తున్నాం. 2100 నాటికి సముద్ర జలాలన్నీ కలుషితమైపోతాయని అమెరికాలోని మసాఛుసెట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) హెచ్చరించింది. ఈ శతాబ్దం ముగిసేనాటికి ప్రపంచంలో ఉన్న సముద్రాల్లో 50 శాతం జలాలు రంగు మారిపోతాయని ఎంఐటీ నివేదికలో వెల్లడించింది. వాతావరణ ప్రభావం ఇప్పటికే సముద్ర జలాల్లో కొద్దిగా మార్పులు కనిపిస్తున్నాయని, రానున్న దశాబ్దాల్లో ఇది తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. నీలి రంగు నుంచి ఆకుపచ్చ వర్ణంలోకి జలాలు మారిపోతాయని నేచర్ కమ్యూనికేషన్ జర్నల్‌లో తెలిపారు. ఎంఐటీ నిపుణుల అధ్యయన నివేదిక తాజా సంచికలో ప్రచురించారు. సముద్ర తీరం, పర్యావరణానికి సంబంధించి ఉపగ్రహం ద్వారా మార్పులను గమనించినట్టు పరిశోధకులు వెల్లడించారు. వివిధ ప్రాంతాల్లో సంభవిస్తున్న వాతావరణం, ఉష్ణోగ్రతలు, సముద్ర జలాల తీరుతెన్నుల పరిశీలించిన నిపుణులు 2100 నాటికి తీవ్రమైన మార్పులుంటాయని హెచ్చరించారు. ఈ శతాబ్దం చివరినాటికి సగం సముద్రాల్లో జలాలు కలుషితం(రంగు) మారిపోతాయని నిర్ధారించారు. నీలి రంగులో ఉన్న నీళ్లు మరింత ముదురు రంగులోకి మారతాయి. అలాగే కొన్ని జలాలు ఆకుపచ్చగా మారిపోతాయని ఎంఐటీ ముఖ్య పరిశోధకుడు స్ట్ఫోనీ డుక్టివిజ్ వెల్లడించారు.