అంతర్జాతీయం

విక్రమ్ సింఘే ప్రతిపాదనకు సిరిసేన నో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, ఫిబ్రవరి 4: కేబినెట్ విస్తరణ కోసం జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రధాని విక్రమ్ సింఘే ప్రతిపాదనను తాను తిరస్కరిస్తున్నట్టు శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తెలిపారు. ప్రధాని విక్రమ్‌సింఘే నేతృత్వంలోని ప్రభుత్వం 225 మంది సభ్యుల సభలో మెజారిటీ నిరూపించుకోవడానికి జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని విక్రమ్ సింఘే పార్లమెంట్ స్పీకర్‌ను అనుమతి కోరారని చెప్పారు. అయితే ఇది కేవలం కేబినెట్ మంత్రుల సంఖ్యను పెంచుకోవడానికి ఉద్దేశించిన ప్రయత్నంగా పేర్కొన్న ఆయన ఇది అనైతికమని, 25 మందికి మించి మంత్రులు మించరాదన్న ప్రజల అభీష్టానికి వ్యతిరేకమని అన్నారు. మంత్రివర్గ విస్తరణ అన్నది నియమాలకు విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఇలావుండగా ఇటీవలే శ్రీలంకలో రాజ్యాంగ సంక్షోభం ఎదురయ్యింది. అధికారంలో ఉన్న విక్రమ్‌సింఘేను అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తొలగించడం, ఆయన స్థానంలో మహీంద్ర రాజపక్సను నియమించడం, అయితే ఆయన తన మెజారిటీ నిరూపించుకోవడంలో రెండుసార్లు విఫలం కావడం, తిరిగి విక్రమ్‌సింఘే గత ఏడాది డిసెంబర్‌లో ప్రధాని కావడం, పార్లమెంట్‌ను రద్దు చేసి జనవరి ఐదున ఎన్నికలు నిర్వహిస్తామని అధ్యక్షుడు ప్రకటించడం, దానిని సుప్రీం కోర్టు కొట్టివేయడం, విక్రమ్ సింఘేయే ప్రధానిగా కొనసాగడం వంటి పరిణామాలు జరిగాయి. దీంతో అప్పటి నుంచి ప్రధాని,మ సిరిసేన మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే శ్రీలంక ముస్లిం కాంగ్రెస్‌కు చెందిన సభ్యులను తమ ప్రభుత్వంలోకి చేర్చుకోవడానికి విక్రమ్‌సింఘే చేస్తున్న ప్రయత్నాలను సిరిసేన అడ్డుకున్నారు. కాగా, శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది నవంబర్‌లో కాని 2020 జనవరిలో కాని జరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో సిరిసేనను ఈసారి ఎట్టిపరిస్థితుల్లో తిరిగి అధ్యక్షుడిని కానివ్వమని విక్రమ్‌సంఘే అంటుండగా, వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసి విజయం సాధించడం ఖాయమని ఇప్పటికే రెండుసార్లు అధ్యక్షుడిగా చేసిన సిరిసేన ప్రకటించారు.