అంతర్జాతీయం

పారిస్‌లో అగ్ని ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, ఫిబ్రవరి 5: ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 10 మంది దుర్మరణం చెందారు. నైరుతీ పారిస్‌లోని ఎర్లాంగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పది మంటలకు ఆహుతికాగా 30 మందిని రక్షించారు. అపార్ట్‌మెంట్ ఎనిమిదో అంతస్తులో మంటలు లేచినట్టు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. అందరూ చూస్తుండగానే మంటలు చుట్టుముట్టాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. చాలా సేపుదట్టమైన పొగ, మంటలు ఎగసిపడుతునే ఉన్నాయని పారిస్ పాలనాధికారి రేమే హెట్జ్ వెల్లడించారు. 30 మందిని రక్షించామని, కొందరు ఇంకా భవనంలో ఉండే అవకాశం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం తెల్లవారుజామున 1 గంట ప్రాంతంలో ప్రమాదం సంభవించింది. 200 మంది అగ్నిమాపక సిబ్బంది కృషి చేయగా మంటలను అదుపులోకి తేవడానికి ఐదు గంటల పట్టింది. తొలుత ఓ మహిళ రక్షించమంటూ పెద్దపెద్దగా అరుస్తూ కనిపించిందని ప్రత్యక్ష సాక్షి చెప్పారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకునే సరిగే మంటలు మొత్తం వ్యాపించాయి.