అంతర్జాతీయం

షరీఫ్ ఆరోగ్య పరిస్థితిపై సర్వత్రా ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరాఫ్ ఆరోగ్య పరిస్థితిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఆయనకు అత్యుత్తమ వైద్య సేవలు అందుతున్నాయని అధికారులు ప్రకటిస్తుంటే, గతంలో లండన్‌లో చికిత్స పొందాడని, కాబట్టి ఆయనను అక్కడికే పంపాలని పాకిస్తాన్ ముస్లిం లీగ్ (పీఎంఎల్) డిమాండ్ చేస్తున్నది. తమ అగ్రనేత షరీఫ్ ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తున్నదని, గుండె సంబంధమైన రుగ్మతతో ఆయన బాధపడుతున్నాడని అంటున్నది. అధికార దుర్వినియోగం, అక్రమాస్తులు వంటి అభియోగాలు రుజువు కావడంతో పాకిస్తాన్ సుప్రీం కోర్టు ఆయనకు ఏడేళ్ల జైలు శిక్షను విధించింది. లాహోర్‌లోని కోట్ లక్పత్ జైల్‌లో ఉన్న ఆయన గుండె సంబంధమైన సమస్యతో బాధపడుతున్నందున ఆయనను సర్వీసెస్ ఆసుపత్రికి తరలించారు. బ్లడ్ కౌంట్, హార్మోన్లు, మూత్రపిండాలు, మెదడు, గుండె, కళ్ల పరీక్షలు నిర్వహించామని సర్వీసెస్ ఆసుపత్రికి చెందిన ప్రొఫెసర్ మహమూద్ అయాజ్ ప్రకటించాడు. కాగా, దేశంలోని అత్యుత్తమ ఆసుపత్రుల్లో, ఉత్తమ కార్డిక్ నిపుణులతో రషీఫ్‌కు చికిత్స జరిపిస్తామని పాక్ అధికారులు ప్రకటించారు. కానీ, షరీఫ్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, పీఎంఎల్ నాయకులు, కార్యకర్తలు మాత్రం ప్రభుత్వ వైఖరి పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో షరీఫ్ ఇంగ్లాండ్‌లో చికిత్స పొందాడని, అక్కడే ఆయనకు సరైన వైద్యం లభిస్తుందని స్పష్టం చేస్తున్నారు. ఇలావుంటే, ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోకుండా జాప్యం చేస్తూ, షరీఫ్ ఆరోగ్య సమస్యలను మరింత సంక్లిష్టం చేస్తున్నదన్న విమర్శలు పాకిస్తాన్‌లో వెల్లువెత్తుతున్నాయి. ఆయనకు ఏమైనా జరగరానిదే జరిగితే, ప్రభుత్వం, అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతకీ షరీఫ్ ఆరోగ్యం నిలకడగా ఉందా? లేదా? అనే విషయంపై స్పష్టత రావడం లేదు.