అంతర్జాతీయం

మహిళా సాధికారతకు పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఫిబ్రవరి 8: ప్రపంచ వ్యాప్తంగా 50 మిలియన్ల మంది మహిళలను సాధికారులను చేయాలనే తన చరిత్రాత్మక కార్యక్రమం లో భాగంగా భారత్‌లో ప్రైవేటు రంగంతో కలిసి రెండు ప్రాజెక్టులు చేపట్టనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనాయంత్రాంగం ప్రకటించింది. అధ్యక్షుడు ట్రంప్ పెద్ద కుమార్తెయే కాకుండా ఆయనకు సీనియర్ అడ్వయిజర్‌గా పనిచేస్తున్న ఇవాంకా ట్రంప్ ఈ కార్యక్రమాలకు నేతృత్వం వహిస్తారు. వుమెన్స్ గ్లోబల్ డెవలప్‌మెంట్ అండ్ ప్రాస్పరిటి (డబ్ల్యూ-జీడీపీ) కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఒక మెమోరాండంపై ట్రంప్ సంతకం చేశారు. అమెరికా ప్రభుత్వం మహిళల ఆర్థిక సాధికారతకు సంబంధించి ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టడం ఇదే తొలిసారి. వీటిలో ఒక కార్యక్రమాన్ని పశ్చిమ బెంగాల్‌లో ప్రారంభిస్తారు. ద యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సి ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (యూఎస్‌ఏఐడీ) పెప్సికోతో కలిసి పశ్చిమ బెంగాల్‌లో పెప్సికో వ్యవసాయ సరఫరా చైన్ల ద్వారా మహిళల ఆర్థిక సాధికారతను పెంపొందిస్తుందని వైట్ హౌస్ తెలిపింది. ‘ద ఓవర్సీస్ ప్రైవేట్ ఇనె్వస్ట్‌మెంట్ కార్పొరేషన్ (ఓపీఐసీ) 100 మిలియన్ డాలర్ల రుణాన్ని భారత్‌లోని మహిళలకు రుణాలు అందజేసే ఇండస్‌ఇండ్‌కు చెందిన మైక్రోఫైనాన్స్ లెండింగ్‌కు విస్తరించడం జరుగుతుంది’ అని అమెరికా అధ్యక్ష కార్యాలయం వివరించింది. యూఎస్‌ఏఐడీ-యూపీఎస్ అవగాహనా పత్రం మహిళా పారిశ్రామికవేత్తలు తమ ఉత్పత్తులను మార్కెట్‌కు ఎగుమతి చేయడం కోసం వారి సామర్థ్యాన్ని మెరుగుపరచడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ప్రారంభ దశలో ఆఫ్రికా, ఆసియా, సెంట్రల్ అమెరికాలపై కేంద్రీకరిస్తుంది. ప్రపంచ మహిళలకు సంబంధించి అమెరికా విదేశాంగ శాఖ కార్యాలయం మహిళా పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్న ఆటంకాలను తగ్గించడానికి గాను మైక్రోఫైనాన్స్ సివిల్ సొసైటి ఆర్గనైజేషన్లతో పనిచేయడానికి ‘వి రైజ్’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది.
డబ్ల్యూ-జీడీపీ ఫండ్‌ను ప్రారంభించనున్నట్టు కూడా అది తెలిపింది. యూఎస్‌ఏఐడీలో తొలి దశలో 50 మిలియన్ డాలర్లతో దీనిని ప్రారంభించనున్నట్టు వివరించింది. మహిళల ఆర్థిక సాధికారతను పెంపొందించడానికి చేపట్టే కార్యక్రమాలకు ఇది మద్దతిస్తుంది. ‘50 మిలియన్లు లేదా అంతకన్నా ఎక్కువ మంది మహిళల చెంతకు ఈ కార్యక్రమాలను తీసికెళ్లడమే మా లక్ష్యం’ అని ట్రంప్ అవగాహనా పత్రంపై సంతకం చేసిన తరువాత వైట్ హౌస్‌లో విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు.