అంతర్జాతీయం

మీ పట్ల మీరు దయచూపితే ఆరోగ్యం మెరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఫిబ్రవరి 9: మన పట్ల, మనం ప్రేమించే వారిపట్ల మనం దయాళువుతో కూడిన ఆలోచనలకు సమయం కేటాయిస్తే అది మనకు మానసికంగా, శారీరకంగా లబ్ధి చేకూరుస్తుందని ఒక తాజా అధ్యయనంలో తేలింది. తమ పట్ల తాము కరుణ చూపే కసరత్తుల వల్ల వారి హృదయ స్పందన ప్రశాంతంగా క్రమపద్ధతిలో ఉంటుందని, శరీర అదిరిపడే చర్య (థ్రెట్ రెస్పాన్స్) నిలిచిపోతుందని బ్రిటన్‌లోని యూనివర్శిటి ఆఫ్ ఎక్సెటర్, యూనివర్శిటి ఆఫ్ ఆక్స్‌ఫర్డ్‌లకు చెందిన పరిశోధకులు చేసిన అధ్యయనం వెల్లడించింది. థ్రెట్ రెస్పాన్స్ శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీస్తుందని గతంలో నిర్వహించిన అధ్యయనాలు వెల్లడించాయి. థ్రెట్ రెస్పాన్స్‌ను నిలిపివేసే సామర్థ్యం వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందని పరిశోధకులు విశ్వసిస్తున్నారు. తాజా అధ్యయనం జర్నల్ క్లినికల్ సైకలాజికల్ సైన్స్‌లో ప్రచురితమయింది. ఈ అధ్యయనం కోసం 135 మంది ఆరోగ్యవంతులయిన విద్యార్థులను అయిదు బృందాలుగా విభజించారు. ఒక్కో బృందం సభ్యులకు ఒక్కో రకమయిన ఆడియో సూచనలు వినిపించారు. వారి హార్ట్ రేట్, స్వెట్ రెస్పాన్స్‌లను గణించారు. అలాగే ఈ విద్యార్థులందరినీ వారు అనుభవించిన మనోభావాలను అడిగి తెలుసుకున్నారు. భద్రత ఎలా ఉంటుందని భావిస్తున్నారు? వారి పట్ల వారు ఎలాంటి కరుణను చూపుతారు? ఇతరులతో ఎలా అనుసంధానం కావాలని భావిస్తున్నారు? వంటి ప్రశ్నలు అడిగారు. రెండు బృందాల విద్యార్థులు ఆడియో సూచనలతో తమ పట్ల తాము దయార్ద్రులయి ఉండటానికి ప్రోత్సాహం పొందారు. వీరు తమ పట్ల తాము మరింత కరుణామయులయి ఉండటమే కాకుండా వారి శరీర రెస్పాన్స్ నిలకడగా ఉంది. వారు మనోవినోదంతో హాయిగా ఉన్నట్టు భావించారు. వారి హార్ట్ రేట్ తగ్గింది. వారి స్వెట్ రెస్పాన్స్ కూడా తగ్గింది. ముప్పు, ఒత్తిడి వంటి భావాలు కలిగేట్లుగా సూచనలు తీసుకున్న వారిలో హార్ట్ రేట్‌తో పాటు స్వెట్ రెస్పాన్స్ కూడా పెరిగింది.