అంతర్జాతీయం

భారతీయ యువకుడిపై లైంగిక వేధింపుల కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయి: దుబాయిలో బ్రిటన్‌కు చెందిన ఒక పర్యాటకురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు భారత్‌కు చెందిన ఒక యువకుడిపై కేసు నమోదయింది. ఒక రెసిడెన్షియల్ టవర్‌లో లిఫ్ట్‌లో వెళ్తుండగా బ్రిటన్‌కు చెందిన 35 ఏళ్ల మహిళ పట్ల 24 ఏళ్ల భారతీయ యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించినట్లు దుబాయి కోర్టులో చార్జిషీట్ దాఖలయింది. మహిళ పట్ల ఆ యువకుడు అనుచితంగా ప్రవర్తించాడని, ఆమెను తాకడానికి యత్నించాడని ప్రాసిక్యూటర్లు అభియోగం మోపారు. ‘సంఘటన జరిగిన రోజు సాయంత్రం సుమారు 4.40 గంటలకు నేను యోగా అభ్యాసం చేయడానికి 37వ అంతస్థులో గల జిమ్‌కు వెళ్తున్నాను. అప్పుడు లిఫ్ట్‌లో మేము ఇద్దరమే ఉన్నాం. అతను నన్ను తాకడానికి నాకు చాలా దగ్గరగా నిలబడ్డాడు. నేను పక్కకు జరిగాను. కాని, నాకు ఎడమ వైపు ఉన్న అతను నాకు దూరం జరగడం లేదు. అతని మూలుగు నాకు వినిపించింది’ అని బాధిత మహిళ ‘ఖలీజా టైమ్స్’కు వివరించింది. ‘అతను 34వ అంతస్థులో లిఫ్ట్‌లో నుంచి బయటకు వెళ్లిపోయాడు. నేను 37వ అంతస్థులోకి చేరుకున్న తరువాత నా దుస్తులపై అతని వీర్యం ఉండటాన్ని గమనించాను’ అని బాధిత మహిళ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఇనె్వస్టిగేటర్‌కు వివరించారు. బాధిత మహిళ హోటల్ భద్రతా సిబ్బందికి ఈ సంఘటనపై ఫిర్యాదు చేశారు. సీసీటీవీ కెమెరాలను తనిఖీ చేయగా, ఆ లిఫ్ట్‌లో కెమెరాలు లేవని తేలింది. అయితే, లిఫ్ట్‌లోకి ప్రవేశించడానికి ముందు నిందితుడు కెమెరాకు చిక్కాడు. అదే టవర్‌లో మరుసటి రోజు అనుమానితుడిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇంటరాగేషన్‌లో తాను ఆ మహిళను తాకడానికి దగ్గరగా నిలబడ్డానని నిందితుడు ఒప్పుకున్నాడని వారు వివరించారు. మహిళ దుస్తులను స్వాధీనం చేసుకొని పరీక్షలు నిర్వహించగా, నిందితుడి డీఎన్‌ఏ ఆ దుస్తులపై ఉన్నట్టు తేలింది. ఈ కేసులో కోర్టు ఈ నెల 25న తీర్పు ఇవ్వనుంది. అయితే, నిందితుడు కోర్టులో తనపై మోపిన అభియోగాలను తోసిపుచ్చాడు.