అంతర్జాతీయం

తలారి ఉద్యోగాల కోసం దరఖాస్తుల ఆహ్వానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, ఫిబ్రవరి 11: జైళ్లలో ఉరితీసే తలారి ఉద్యోగాల కోసం శ్రీలంక ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. ఖైదీల ఉరిశిక్షలపై అమలు చేసిన మారిటోరియం మరో రెండు నెలల్లో ముగియనుంది. దీంతో ఉరిశిక్షలు అమలుచేయడం అనివార్యంగా మారింది.
లంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన మారిటోరియంపై ఇటీవలే అధికార ప్రకటన చేశారు. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జైళ్లశాఖ కమిషనర్ పీఎన్‌ఎం ధనసింఘే సోమవారం ఇక్కడ వెల్లడించారు. ప్రకటన వెలువడినప్పటి నుంచే దరఖాస్తులు పరిశీలన ఉంటుందని ఆయన తెలిపారు. శ్రీలంకలో ఆఖరి మరణశిఖ 1076 జూన్‌లో అమలైంది. అప్పటి నుంచి ఒక్క ఖైదీని కూడా ఉరి తీసిన దాఖలాలులేవు. తరువాత వచ్చిన దేశాధ్యక్షులు అందరూ మరణశిఖ అమలుకు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు చేయలేదు. 42 ఏళ్లుగా ‘విరామం’ కొనసాగుతునే ఉంది. అయితే అధికారిక మారిటోరియం రెండు నెలల్లో తీరిపోనుంది. దేశంలో మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఒక విధంగా పెనుసవాల్‌గానే మారింది. ఈనేపథ్యంలో కోర్టులు విధించే మరణశిక్షలు అమలుచేస్తేనే తీవ్రమైన నేరాలు ముఖ్యంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణా అదుపుచేయవచ్చని సిరిసేనా ప్రభుత్వం భావిస్తోంది.
గతవారమే అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన దీనిపై ఓ ప్రకటన చేశారు.‘వచ్చే రెండు మూడు నెలల్లో ఉరిశిక్షలు అమలుచేయాలని నేను నిర్ణయించుకున్నాను’అని ఆయన ప్రకటించారు. జైళ్లలో ఉరితీసే ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వాటి భర్తీకి తక్షణమే చర్యలు తీసుకుంటున్నట్టు ధనసింఘే వెల్లడించారు.