అంతర్జాతీయం

150 ఏళ్లలో గరిష్టస్థాయి ఉష్ణోగ్రతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఫిబ్రవరి 13: ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అడవులు క్షీణించడం, పర్యావరణం దెబ్బతినడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. 2014 నుంచే ఉష్ణోగ్రతలు ఒక డిగ్రీ సెల్సియస్ చొప్పున పెరగడం గమనార్హం. గత 150 ఏళ్లలో ఈ విధంగా ఉష్ణోగ్రతలు పెరగడం వాతావరణ మార్పులను సూచిస్తోంది. 2014లో మొదలైన ఉష్ణోగ్రతల పెరుగుదల, 2023 వరకు కొనసాగుతుంది. ఈ వివరాలను సైంటిస్టులు చెప్పారు. యూకే వాతావరణ పరిశోధన కార్యాలయం ఈ వివరాలను విడుదల చేసింది. 1850 కంటే ముందు ఈ విధంగా ఉష్ణోగ్రతలు పెరిగా యి. పారిశ్రామిక విప్లవానికి ముందే ఈ పరిస్థితులు ఉండేవని శాస్తవ్రేత్త ఆడమ్ స్ఫైప్‌చెప్పారు. 2023లో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో ఉంటాయ ని అంచనా. 150 ఏళ్లలో 2014లో గరిష్టస్థాయిలో ఇప్పటికే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 169 ఏళ్ల రికార్డు చూస్తే 2015,2016, 2017లో కూడా ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో నమోదయ్యాయి. పర్యావరణంలో వస్తున్న మార్పులు, భూమండలంలో వివిధ ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పులు, సముద్రం, హిమ పర్వతాల్లో అంతర్గత పరిస్థితుల వల్ల ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమని డాగ్ స్మిత్ అనే శాస్తవ్రేత్త చెప్పారు.