అంతర్జాతీయం

కాస్త తగ్గిన నిరుద్యోగిత రేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెనీవా, ఫిబ్రవరి 13: ప్రపంచంలో నిరుద్యోగిత రేటు గత సంవత్సరం తగ్గిందని ఐక్యరాజ్య సమితి (ఐరాస) బుధవారం తెలిపింది. అయితే, ఉద్యోగాలు తరచుగా యోగ్యమయిన జీవనాన్ని కల్పించడంలో విఫలమవుతున్నాయని పేర్కొంది. సుమారు 700 మిలియన్ల మంది వర్కర్లు పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నారని వివరించింది. ప్రపంచంలో 2017లో 5.1 శాతం ఉన్న నిరుద్యోగం గత సంవత్సరం 5.0 శాతానికి తగ్గింది. 2008లో ప్రపంచ ఆర్థిక మాంద్యం సంభవించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ స్థాయిలో నిరుద్యోగం తగ్గడం ఇదే మొదటిసారని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్‌ఓ) తెలిపింది. అయితే, ప్రపంచ జాబ్ మార్కెట్‌లో ఆరోగ్య పరిస్థితిపై ఐఎల్‌ఓ ‘వరల్డ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ సోషల్ ఔట్‌లుక్’ పేరిట విడుదల చేసిన తన నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. ఐఎల్‌ఓ డిప్యూటి డైరెక్టర్ జనరల్ డెబొరా గ్రీన్‌ఫీల్డ్ జెనీవాలో విలేఖరులతో మాట్లాడుతూ ప్రపంచ నిరుద్యోగం కొంత తగ్గినప్పటికీ, అనేక రంగాలలో అనిశ్చితి నెలకొందని, ఆర్థిక పరిస్థితి దిగజారుతోందని పేర్కొన్నారు. కార్మికుల సంఖ్య పెరుగుతున్న కారణంగా వచ్చే సంవత్సరం మొత్తం నిరుద్యోగుల సంఖ్య రెండు మిలియన్లు పెరిగి, 174 మిలియన్లకు చేరుకుంటుందని, అయినప్పటికీ 2019, 2020లలో కూడా నిరుద్యోగం రేటు సుమారు ఇదే స్థాయిలో ఉంటుందని ఐఎల్‌ఓ పేర్కొంది. ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ఉపాధి అవకాశాలు కలిగి ఉన్నప్పటికీ, వందల మిలియన్ల మంది ఇంకా పేదరికంలోనే మగ్గుతున్నారని ఈ నివేదిక వెల్లడించింది.