అంతర్జాతీయం

గ్లోబల్ విలేజ్..మనమే టాప్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, ఫిబ్రవరి 17: ఆర్థిక సరళీకరణతో ప్రపంచమంతా ఓ కుగ్రామమైంది. అలాంటిది డజన్లకొద్దీ దేశాల భిన్న సంస్కృతులు ఒకేచోట మేళవిస్తే.. అది కచ్చితంగా గ్లోబల్ విలేజ్! ఏ దేశమేగినా భారతీయుల సంఖ్యకు కొదవలేదు. దుబాయ్‌లో మనవారి సంఖ్య మరీ ఎక్కువ. ఎన్నో దేశాలు పోటీ పడుతూ వంటకాలు మొదలుకుని భిన్న వస్తువులను ప్రదర్శిస్తున్నప్పటికీ ఈ గ్లోబల్ విలేజ్‌లో భారతీయులదే పైచేయి. జనరంజకమైన ‘ఖుదాగవా..’ తరహా పాటలు మొదలుకుని పల్లీ బఠాణీ వరకూ మనవారి తరహా వ్యాపారానికి తిరుగే లేదు. దాదాపు 60 దేశాల నుంచి విభిన్న రంగాలకు చెందిన వ్యాపారులు ఇక్కడ స్టాల్స్‌ను ఏర్పాటు చేసుకున్నారు. గత ఏడాది అక్టోబర్ 30న పారంభమైన ఈ ప్రాజెక్టు ఏప్రిల్ 6 వరకు కొనసాగుతుంది. ఇక్కడ అమెరికా, చైనా, ఈజిప్ట్, టర్కీ తదితర దేశాలకు చెందిన 27 పెవిలియన్స్‌ను ఏర్పాటు చేసినప్పటికీ భారతీయులదే అతిపెద్ద పెవిలియన్.
దాదాపు 11000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ పెవిలియన్ ఏర్పాటు చేశారు. గ్లోబల్ విలేజ్‌లో ఇంతవరకూ ఏర్పాటు చేసిన పెవిలియన్లలో ఇదే అతి పెద్దదని ఈ పెవిలియన్ నిర్వాహకుడు ఈ4 ఎంటర్‌టైనర్స్ మేనేజింగ్ డైరెక్టర్ సునిల్ భాటియా వివరించారు. సందర్శకులను ఆకర్షించేందుకు ప్రతి ఏడాది కొత్త తరహాలో పెవిలియన్‌ను ఏర్పాటు చేయడం జరుగుతోందని ఆయన తెలిపారు. ఇక్కడ ప్రముఖంగా హైదరాబాద్ చీరలు, కొలాబా పెర్‌ఫ్యూమ్, కశ్మీర్ హేండ్‌లూమ్స్, రాజస్థాన్ హెన్నాలకు మంచి ఆదరణ లభిస్తోందని అన్నారు. ఇక్కడ తినుబండారాల ధరలు కొంచెం ఎక్కువేనని సందర్శకులు తెలిపారు. ఒక పీనట్ కోన్ ధర ఐదు ధిర్‌హామ్స్ ఉంటోందని వారు వాపోయారు. అయితే విదేశీయులు వీటిని బాగానే కొనుగోలు చేస్తారని, భారతీయులు మాత్రమే ఆచితూచి కొనుగోలు చేస్తుంటారని తెలిపారు. ఈ ప్రాజెక్టు కాలం ముగిసిన వెంటనే నిర్మాణాలన్నీ కూల్చివేసి ప్రతి యేటా కొత్తవాటిని నిర్మిస్తుండడం విశేషం.