అంతర్జాతీయం

హైకమిషనర్‌ను స్వదేశానికి పిలిపించిన పాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఫిబ్రవరి 18: జమ్మూ-కాశ్మీర్‌లోని పుల్వామాలో గత గురువారం జైషే ఉగ్రవాదుల భీకర దాడిలో 44 మంది సీఆర్‌పీఎఫ్ బలగాలు హతమైన సందర్భంగా చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్‌లో హైకమిషనర్‌గా పనిచేస్తున్న సొహైల్ మహమూద్‌ను పాకిస్తాన్ ఉన్నఫళంగా సోమవారం స్వదేశానికి పిలిపించింది. పుల్వామా ఘటన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో తీవ్ర ఒత్తిడులు నెలకొన్నందున దీనిపై చర్చించేందుకు తక్షణమే స్వదేశానికి రావాలని తమ దేశ హైకమిషనర్‌కు పాక్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో భారత్‌లోని పాక్ హైకమిషనర్ సొహైల్ మహమూద్ సోమవారం ఉదయం హుటాహుటిన ఇస్లామాబాద్‌కు బయలుదేరారు. ఈ విషయాన్ని విదేశీ మంత్రిత్వ శాఖ కార్యాలయ అధికార ప్రతినిధి మహమ్మద్ ఫైజల్ స్పష్టం చేశారు. ‘చర్చలు జరిపేందుకు వీలుగా భారత్‌లోని మా హైకమిషనర్‌ను స్వదేశానికి రమ్మని పిలిచాం. దీంతో ఆయన ఢిల్లీ నుంచి వెంటనే బయలుదేరారు’ అని మహమ్మద్ ఫైజల్ ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. 44 మంది సీఆర్‌పీఎఫ్ సైనికులను పాక్ ముష్కరులు బలిగొన్న నేపథ్యంలో గత శుక్రవారంనాడే భారత విదేశీ కార్యదర్శి విజయ్ గోఖలే పాక్ హైకమిషనర్ మహమూద్‌కు సమనున్ల జారీ చేశారు. కాగా, పుల్వామా ఘటన జరిగిన వెంటనే పాక్‌లోని భారత హైకమిషనర్ అజయ్ బిసారియాను చర్చల కోసం తక్షణం స్వదేశానికి రావాలని పిలిపించారు.