అంతర్జాతీయం

ఐరాస ఆదుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఫిబ్రవరి 19: కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత్ ప్రతిస్పందనకు పాకిస్తాన్ ఉలిక్కిపడుతోంది. ఎప్పుడు తమదేశంపై భారత్ దాడి చేస్తుందో అన్న భయం ఆ దేశంలో ప్రారంభమైంది. దీంతో భారత్ నుంచి దాడి జరగకుండా శాంతి మంత్రం పఠిస్తోంది. భారత్‌తో నెలకొని ఉన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తక్షణం జోక్యం చేసుకుని రెండు దేశాల మధ్య చర్చలు జరిపేలా మధ్యవర్తిత్వం వహించాలని పాకిస్తాన్ విదేశాంగ శాఖ.. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌కు విజ్ఞప్తి చేసింది. ఈనెల 14న కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మందికి పైగా సీఆర్‌పీఎఫ్ జవాన్లను పాక్ ఉగ్రవాద జైషే మహమ్మద్ సంస్థ చంపిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థతులు నెలకొన్నాయి. పాక్‌కు తగిన గుణపాఠం చెబుతామని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొనడం, ఉగ్రవాదులపై దాడుల విషయంలో ఆర్మీకి పూర్తి అధికారాలు దఖలుపర్చడం వంటి నిర్ణయాలు చకచకా జరిగిపోవడమే కాక, ఉగ్రదాడికి ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న కమ్రన్‌ను భారత్ భద్రతాదళాలు సోమవారం కాల్చి చంపాయి. అంతేకాకుండా పాక్‌ను మోస్ట్‌ఫేవర్డ్ నేషన్ (ఎంఎఫ్‌ఎన్) హోదా నుంచి తప్పించడంతో పాటు పలు ఎగుమతులను భారత్ నిలిపివేయడమే కాక, పాక్ నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువుల సుంకాలను 200 శాతం పెంచింది. అన్ని వైపుల నుంచి అష్టదిగ్బంధనం ప్రారంభం కావడంతో దిక్కుతోచని పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించింది. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా దెబ్బతినడమే కాకుండా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పాక్ బెంబేలెత్తుతోంది. దీంతో పాక్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషి ఐక్యరాజ్య సమితికి సోమవారమే ఒక లేఖను పంపారు. ఇరుదేశాల మధ్య ప్రస్తుతం నెలకొని ఉన్న ఉద్రిక్త పరిస్థితులను సడలడానికి సహకారం అందించాలని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుట్టెరస్‌ను కోరారు. సరిహద్దులో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉంది.. భారత్ నుంచి మా దేశంపై దాడి ఏ క్షణంలోనైనా జరిగే అవకాశం ఉందని మీ దృష్టికి తీసుకువస్తున్నాను.. అని ఆయన పేర్కొన్నారు. దీనిపై మీ తక్షణ జోక్యాన్ని కోరుతున్నా.. అని ఆయన కోరారు. కాశ్మీర్ సమస్యపై మూడో దేశం జోక్యాన్ని భారత్ తిరస్కరించి ఈ సమస్య కేవలం ద్వైపాక్షిక చర్చల ద్వారా మాత్రమే పరిష్కారం కావాలని గతంలో పేర్కొన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. పుల్వామా జిల్లాలో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై జరిగిన దాడికి కారకుడు కాశ్మీరి నివాసి అని, ఈ సంఘటనపై ఎలాంటి దర్యాప్తు చేయకుండానే పాకిస్తానే కారణమంటూ భారతదేశం రాజకీయ ప్రయోజనాలతో తమపై లేనిపోని ఆరోపణలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు.