అంతర్జాతీయం

సంయమనం ముఖ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్: పుల్వానా ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్, పాక్ దేశాలు సంయమనంతో వ్యవహరించాలని, పరస్పరం రెచ్చగొట్టుకునే ప్రకటనలు చేయడం మానుకోవాలని చైనా హితవుపలికింది. వివాదస్పద అంశాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కోరింది. ఈ నెల 14వ తేదీన పుల్వానాలో ఉగ్రవాద దాడి ఘటనలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు అమరులైన సంగతి విదితమే. పాకిస్తాన్ దుశ్చర్యలకు నిరసనగా భారత్ ఇప్పటికే పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యంలో చైనా ఒక ప్రకటన విడుదల చేసింది. పాకిస్తాన్, ఇండియాలు దక్షిణాసియా దేశాల్లో ప్రధానమైనవని చైనా పేర్కొంది. ఈ ప్రాంతంలో శాంతి వికసించాలంటే తప్పనిసరిగా రెండు దేశాలు శాంతి ప్రక్రియను చేపట్టాలన్నారు. భారత్ ఉప ఖండంలో శాంతి నెలకొనాలంటే ద్వైపాక్షిక చర్చలను ప్రారంభించాలని చైనా కోరింది. పాకిస్తాన్, సౌదీ అరేబియాతో సత్సంబంధాలు కొనసాగించడాన్ని తాము ఆహ్వానిస్తామని చైనా ప్రతినిధి జెంగ్ షాంగ్ అన్నారు. చైనా-పాకిస్తాన్ మధ్య చేపట్టిన ఆర్థిక కారిడార్ పనులు చరుకుగా కొనసాగుతున్నాయన్నారు. నిర్దేశించిన విధానం ప్రకారం మూడవ దేశం ఆధ్వర్యంలో కూడా ఈ సమస్యను పరిష్కరించుకుంటే బాగుంటుందని చైనా అభిప్రాయం వ్యక్తం చేసింది.