అంతర్జాతీయం

కులభూషణ్ గూఢచారే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ది హేగ్, ఫిబ్రవరి 19: భారత నౌకాదళ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్ అరెస్టును పాకిస్తాన్ ప్రభుత్వం సమర్ధించుకుంది. బలూచీస్థాన్‌లో జాదవ్‌ను అరెస్టు చేసిన తరువాత మిలటరీ కోర్టులో హాజరుపరిచారు. పాక్ మిలటరీ కోర్టు కులభూషణ్‌కు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. కుల్‌భూషణ్ కేసులో హేగ్ అంతర్జాతీయ న్యాయస్థానంలో పాక్, భారత్ తమతమ వాదనలు వినిపిస్తున్నాయి. విచారణ రెండోరోజు మంగళవారం పాకిస్తాన్ తరఫున న్యాయవాది ఖవార్ ఖురేషీ తన వాదనలు వినిపించారు. జాదవ్ అరెస్టుపై భారత్ చేస్తున్న ఆరోపణలు అవాస్తవాలని ఆయన కొట్టిపారేశారు. ‘కుల్‌భూషణ్ వ్యాపారవేత్త కాదు. అతడు గూఢచారి’అని కోర్టులో ఆయన వాదించారు. జాదవ్ కేసు హేగ్ న్యాయస్థానంలో నాలుగురోజుల విచారణ సాగుతుంది. పుల్వామాలో ఉగ్రదాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతి నేపథ్యంలో ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో జాదవ్‌కేసు విచారణకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. భారత్ తరుఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే సోమవారం తన వాదనలు వినించారు.‘అంతర్జాతీయ చట్టాలపై భారత్‌కు ఏమాత్రం విశ్వాసం లేకపోవడం దురదృష్టకరం’అని ఖురేషీ అన్నారు. దేశంలో శాంతిస్థాపనకు పాకిస్తాన్ ఎంతో కృషి చేస్తోందని, తమ భద్రతా దళాలను అనేక సందర్భాల్లో కోల్పోయినట్టు కోర్టుకు తెలిపారు. ఈవేవీ భారత్‌కు తెలియదని ఖురేషీ ఆరోపించారు. ప్రతిదాన్ని రాజకీయ కోణంలోనే చూడడం భారత్‌కు అలవాటని,చట్టాలపై వారికి గౌరవం లేదని పాక్ న్యాయవాది తీవ్రమైన విమర్శలు చేశారు. ‘కుల్‌భూషణ్ ఓ గూఢచారి. అతడు వ్యాపారవేత్తకాదు’అని కోర్టుకు తెలిపారు. ఉగ్రవాద చర్యల కోసం భారత్ అధికారులు జాదవ్‌ను ఓ పావుగా వాడుకున్నారని న్యాయవాది తీవ్ర ఆరోపణలు చేశారు. జాదవ్‌ను ఇరాన్‌లో అరెస్టు చేశామని భారత్ చేస్తున్న ఆరోపరణను ఖురేషీ తోసిపుచ్చారు. అతడిని బలూచీస్థాన్‌లోనే పట్టుకున్నామని ప్రధాన న్యాయమూర్తికి తెలిపారు. కాగా బెంచ్‌లోని పాకిస్తాన్ తాత్కాలిక న్యాయమూర్తికి గుండె నొప్పి రావడడంతో విధుల నుంచి తప్పుకున్నారు. దీంతో కేసు విచారణ వాయిదా వే యాలని పాక్ న్యాయవాది ఖురేషీ ధర్మాసనానికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. అందుబాటులో ఉన్న న్యాయమూర్తితోనే వి చారణ కొనసాగించాలని కోర్టు ఆదేశించింది. చట్టాలపై తమకు గౌరవం ఉండబట్టే జాదవ్‌ను కలవడానికి అతడి కుటుంబ సభ్యులకు అనుమతి ఇచ్చినట్టు పాక్ స్పష్టం చేసింది.