అంతర్జాతీయం

ఉద్రిక్తతలు వద్దు.. శాంతి చర్చలు ప్రారంభించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్యసమితి, ఫిబ్రవరి 20: దక్షిణాసియాలో ఉద్రిక్తతలు పెరగకుండా భారత్, పాకిస్తాన్ దేశాలు సంయమనం పాటించాలని ఐరాస సెక్రట జనరల్ ఆంటొనియో గెటిరిస్ అన్నారు. పుల్వానా ఉగ్రవాద దాడిని ఆయన ఖండించారు. ఉగ్రవాదం నిర్మూలనకు ఐరాస అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు. ఇరు దేశాలు కూడా ఉద్రిక్తతలు హద్దుమీరకుండా చూడాలన్నారు. ఇరుదేశాల మధ్య ఇప్పటికే సంబంధాలు క్షీణించాయన్నారు. ఇరుదేశాలు అడిగితే ఉద్రిక్తతల నివారణకు అవసరమైన సహాయం చేసేందుకు, చర్యలు తీసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. ఈ వివరాలను ఐరాస సెక్రటరీ జనరల్ ప్రతినిధి స్ట్ఫెన్ డుజారిక్ చెప్పారు. ఐరాస సెక్రటరీ జనరల్‌ను కలిసి ఉద్రిక్తతల విషయమై చర్చించాలని ఇప్పటికే పాకిస్తాన్ బృందం కోరిందని ఆయన చెప్పారు. ఐరాస రంగంలోకి దిగి ఉద్రిక్తతలను తగ్గించేందుకు చొరవ చూపాలని పాకిస్తాన్ కోరింది. పుల్వానాలో 14వ తేదీన జరిగిన ఘటన తర్వాత ఐరాస అన్ని విషయాలను పరిశీలిస్తోందని, పర్యవేక్షణ పెంచామని ఐరాస పేర్కొంది. జమ్ములో ఇటీవల ఐక్యరాజ్యసమితి వాహనం వెళితే కొంత మంది వ్యక్తులు గుమిగూడి పాకిస్తాన్ జెండాను ఉంచారని ఆయన చెప్పారు. ఈ వాహనం నుంచి జెండా తొలగించేందుకు తీసుకున్న చర్యలను గుంపులో ఉన్న వ్యక్తులు ప్రతిఘటించారన్నారు. ఈ ఘటన తర్వాత ఇరుదేశాల్లో అవాంచనీయ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. సిమ్లా ఒప్పందం ద్వారా జమ్ములో ఐక్యరాజ్యసమితి మిలిటరీ అబ్జర్వర్ గ్రూప్ కొనసాగడం వృథా అనే అభిప్రాయంతో భారత్ ఉంది. కాగా సెక్రటరీ జనరల్ మాట్లాడుతూ పుల్వానా దాడికి బాధ్యులైన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలన్నారు. మరణించిన జవాన్ల కుటుంబాలకు ఆయన సానుభూతి తెలియచేశారు. గాయపడిన వారు త్వరితగతిన కోలుకోవాలని ఆయన ఆకాకంక్షించారు. ఇరుదేశాలు చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని, ఉద్రిక్తతలను తగ్గుముఖం పట్టేందుకు చర్యలు తీసుకోవాలని సెక్రటరీ జనరల్ భారత్, పాక్‌ను మొదటి నుంచి కోరుతున్నారు.