అంతర్జాతీయం

గాంధీ బాటే శరణ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సియోల్, ఫిబ్రవరి 21: ఉగ్రవాదం, పెరుగుతున్న భూతాపం, క్షీణిస్తున్న పర్యావరణ సమతుల్యత మానవ మనుగడకు ముప్పుగా పరిణమించాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మహాత్మాగాంధీ బోధనలు, జీవన విధానం ప్రపంచ ప్రజలకు ఆదర్శమని, మానవాళిని వేధిస్తున్న అనేక జటిల సమస్యలకు గాంధీజీ జీవితం సరైన పరిష్కారం చూపుతుందని అన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన ఇక్కడకు గురువారం చేరుకున్నారు. యోన్సీయ్ విశ్వవిద్యాలయంలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ ఈ రోజు తన జీవితంలో మర్చిపోలేని రోజని అన్నారు. ఉగ్రవాదం, భూతాపం, వాతావరణ మార్పుల వల్ల ప్రతి దేశం తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నాయన్నారు. అన్ని దేశాలు సమష్టిగా ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం చేయాలని అన్నారు. పుల్వానాలో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాద దాడిని దృష్టిలో పెట్టుకుని ఈ అంశంపై ఎక్కువగా ప్రసంగించారు. ఐక్యరాజ్యసమితి మాజీ సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ తన హయాంలో మహాత్మాగాంధీ జయంతిని అహింసా దినోత్సవంగా ప్రకటించారని అన్నారు. ఆయన బోధనలే ఉగ్రవాదంపై పోరుకు ప్రేరణ అని అన్నారు. 20వ శతాబ్ధంలో మానవాళికి దేవుడు ఇచ్చిన గొప్పవరం మహాత్మాగాంధీ అని ఉద్ఘాటించారు. మానవ వనరులను సద్వినియోగం చేసుకోవాలని, ప్రకృతి సంపదను నాశనం చేయరాదని గాంధీ చెప్పేవారని అన్నారు. జీవన విధానం నిరాడంబరంగా ఉండాలని, విలాసవంతమైన జీవన విధానం మంచిది కాదని గాంధీజీ బోధనలు సూచిస్తున్నాయని అన్నారు. గత నాలుగున్నరేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణ కొరియాను సందర్శించడం ఇది రెండవసారి కావడం విశేషం.

చిత్రం.. సియోల్‌లో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో
భారత ప్రధాని నరేంద్ర మోదీ, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్‌బాబు