అంతర్జాతీయం

దోషులను శిక్షించాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్యసమితి, ఫిబ్రవరి 21: పుల్వామాలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదదాడిని ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని 15 దేశాలు తీర్మానం చేశాయి. ఈ తీర్మానానికి చైనా కూడా మద్దతు పలికింది. పుల్వామా దాడి పిరికిపంద చర్యని ఈ తీర్మానంలో పేర్కొన్నారు. ఇటువంటి హీనమైన చర్యలకు పాల్పడిన వారిని, ఆర్థికంగా మద్దతు ఇచ్చిన వారిని అరెస్టు చేసి చట్టం ముందు దోషులుగా నిలబెట్టాలని భద్రతా మండలి తీర్మానంలో పేర్కొన్నారు. ఈ తీర్మానానికి మద్దతు తెలిపిన చైనాకు వీటో అధికారం ఉంది. గతంలో ఈతరహా తీర్మానాలు వచ్చిన సందర్భంలో చైనా వీటో అధికారాన్ని ప్రయోగించేది. కాగా ఈ సారి తీర్మానానికి చైనా సంపూర్ణ మద్దతు ఇచ్చింది. ఈ తరహా ఉగ్రవాదదాడులకు పాల్పడిన సంస్థలను ఎండగట్టాలని, కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని తీర్మానంలో భద్రతా మండలి దేశాలు పిలుపునిచ్చాయి. ఉగ్రవాద దాడికి సహకరించిన దుండగులను పట్టుకునేందుకు అంతర్జాతీయంగా అన్ని దేశాలు భారత్‌కు తోడ్పాటును అందించాలని భద్రతా మండలి కోరింది. ఈ నెల 14వ తేదీన పుల్వామా వద్ద జరిగిన ఉగ్రవాద ఆత్మహుతిదాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చేవారిని, ఆర్థికంగా సహకరించేవారిని, ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆశ్రయం ఇచ్చిన వారిని అంతర్జాతీయంగా దోషులుగా నిలబెట్టి వారిని కఠినంగా శిక్షించాలని తీర్మానంలో ప్రపంచదేశాలకు విజ్ఞప్తి చేశారు. ఈ దాడిలో మృతి చెందిన కుటుంబాలకు తీర్మానంలో ప్రగాఢసంతాపం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ శాంతి, భద్రతలకు ఉగ్రవాదంసవాలుగా తయారైందని తీర్మానంలో పేర్కొన్నారు.