అంతర్జాతీయం

హెచ్-1బీ వీసాల నియమాల్లో మార్పు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఫిబ్రవరి 22: అమెరికాలో హెచ్-1బీ వీసాలు కలిగి ఉన్నవారి దాంపత్య భాగస్వాములకు ఉద్యోగం చేయడానికి ఉన్న అనుమతిని తొలగిస్తూ ప్రస్తుత నియమావళికి మార్పులు చేసే ప్రతిపాదనను అధ్యక్ష భవనం వైట్ హౌస్ స్వీకరించింది. భారత్‌కు చెందిన ఐటీ నిపుణుల్లో ఎక్కువ మంది అమెరికాలో ఉండటానికి హెచ్-1బీ వీసాను తీసుకుంటున్నారు. అమెరికా ప్రభుత్వం ఈ ప్రతిపాదనను ఆమోదిస్తే హెచ్-1బీ వీసాలు కలిగి ఉన్న దాదాపు 90 వేల మందిపై దాని ప్రభావం పడుతుంది. ఈ 90వేల మందిలో అత్యధికులు భారత్‌కు చెందిన వారే ఉన్నారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటి ఈ ప్రతిపాదనను ‘వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఫర్ బడ్జెట్’కు బుధవారం సమర్పించిందని అధికారులు తెలిపారు. అమెరికన్ కంపెనీలు సైద్ధాంతిక, సాంకేతిక నైపుణ్యం గల విదేశీయులను ఉద్యోగులుగా నియమించుకోవడానికి నాన్-ఇమ్మిగ్రేంట్ వీసా అయిన హెచ్-1బీ వీసా వీలు కల్పిస్తోంది. అమెరికాలోని టెక్నాలజి కంపెనీలు ప్రతి సంవత్సరం భారత్, చైనా వంటి దేశాల నుంచి హెచ్-1బీ వీసాల ఆధారంగా వేలాది మందిని ఉద్యోగులుగా నియమించుకుంటున్నాయి. ఈ వీసాలు కలిగి ఉన్న వారి దాంపత్య భాగస్వాములు అమెరికాలో ఉద్యోగాలు చేయడానికి ఉన్న అనుమతిని తొలగిస్తూ నియమాలను సవరించే ప్రతిపాదనపై ఇప్పుడు వైట్ హౌస్ నిర్ణయం తీసుకోవలసి ఉంది. ఆ తరువాత లాంఛనంగా ఆదేశాలు జారీ చేస్తారు. అనంతరం ఈ విషయాన్ని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటి ఫెడరల్ కోర్ట్‌కు తెలియచేస్తుంది. ఫెడరల్ కోర్టులో ఇప్పటికే ఈ అంశంపై ఒక వ్యాజ్యం పెండింగ్‌లో ఉంది. ఇప్పుడు వైట్ హౌస్ ప్రతిపాదిత సవరణలను సమీక్షిస్తుంది. వివిధ ఏజెన్సీల నుంచి అవసరమయిన సమాచారం తీసుకుంటుంది. ఆ తరువాత తుది నిర్ణయం తీసుకుంటుంది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి కొన్ని వారాల నుంచి అనేక నెలల వరకు సమయం పట్టవచ్చు. అమలులో ఉన్న ప్రక్రియ ప్రకారం ఒకసారి వైట్ హౌస్ ఆమోదం లభిస్తే సవరించిన నియమాలను ఫెడరల్ రిజిస్టర్‌లో ప్రచురిస్తారు. తరువాత 30 రోజుల కామెంట్ పీరియడ్ ఉంటుంది. ఈ కాలపరిమితి పూర్తయిన తరువాతే కొత్తగా చేసిన సవరణలు అమలులోకి వస్తాయి. సెనేటర్ కమల హర్రిస్ సహా కొంతమంది అమెరికా చట్టసభల సభ్యులు, సిలికాన్ వ్యాలీ కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ అమెరికా పాలనా యంత్రాం గం హెచ్-1బీ వీసాల నియమాలను సవరించనుంది.