అంతర్జాతీయం

పాక్‌పై కఠిన చర్యలు తప్పవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఫిబ్రవరి 23: జమ్మూ-కాశ్మీర్‌లోని పుల్వామాలో పాక్ ప్రేరేపిత ముష్కరుల భీకర దాడుల అనంతరం పాకిస్తాన్‌పై చాలా కఠినంగా వ్యవహరించేందుకు భారత్ యోచిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. పుల్వామా జిల్లాలో ఈనెల 14న పాక్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే అహమ్మద్ జరిపిన ఆత్మాహుతి దాడిలో 41 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు బలైన నేపథ్యాన్ని ఆయన ప్రస్తావించారు. పుల్వామా ఘటన తర్వాత ఇరు దేశాల మధ్య ఇప్పటికే కొనసాగుతున్న సమస్యలకు తోడు మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం లేకపోలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తమ సైనికులపై టెర్రిరిస్టుల దాడి అనంతరం ఇందుకు కారణమైన పాక్‌ను ప్రపంచ దేశాల మధ్య దోషిగా నిలబెట్టేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఉభయ దేశాల మధ్య దౌత్య సంబంధాలు బెడిసికొట్టే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. చైనా వైస్ ప్రీమియర్ లీయు అధ్యక్షతన జరిగిన వాణిజ్య ప్రతినిధుల సమావేశానికి హాజరైన అనంతరం వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీసులో అమెరికా అధ్యక్షుడు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ‘ప్రస్తుతం కాశ్మీర్‌లో పరిస్థితులు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి’ అంటూ ఉగ్రదాడిపై పాక్‌కు గట్టిగా సమాధానం చెప్పేందుకు భారత్ సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. ‘దాదాపు 50 మందిని పొట్టన పెట్టుకున్న ప్రత్యర్థి దేశానికి గట్టి సమాధానం ఇచ్చేందుకు భారత్ ఎదురుచూస్తోంది. ఈ విషయాన్ని నేను అర్థం చేసుకోగలను’ అని ట్రంప్ అన్నారు. అయితే, ఇరు దేశాల మధ్య ఉద్రికత్తలు తగ్గించేందుకు తద్వారా శాంతియుత వాతావరణం కల్పించేందుకు అగ్రరాజ్యమైన అమెరికా తగిన చొరవ తీసుకుంటోందని ఆయన అన్నారు. ఇరు దేశాల మధ్య సమస్యాత్మక అంశాలు అనేకం ఉన్నాయి. ఆయా సమస్యల పరిష్కారానికి తాము ఎంతోమందితో చర్చలు జరపనున్నామని ఆయన ఆయన స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య సమన్వయం దెబ్బతిన్న నేపథ్యంలో శాంతియుత వాతావరణ పాదుకొల్పేందుకు, ఉద్రిక్తతలను తగ్గించేందుకు తమ వంతు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.
ఉగ్రదాడులకు పాల్పడుతున్న ముష్కర మూకలకు వివిధ రూపాల్లో అందిస్తున్న శిక్షణ, ఆర్థిక సహాయంతోపాటు వారిని ప్రత్యర్థి దేశాలపై దాడులకు పురికొల్పేందుకు చేపడుతున్న చర్యలను తక్షణం ఉపసంహరించుకోవాలని అగ్రరాజ్యం అమెరికా సైతం పాకిస్తాన్‌ను కోరింది. పుల్వామా ఘటన అనంతరం పాక్ దుశ్చర్యలను ప్రపంచంలోని అమెరికా సహా ఎన్నో దేశాలు తీవ్రంగా ఖండించాయి. పాక్ భూభాగంలో టెర్రరిస్టులకు ఎలాంటి సహాయం అందించవద్దని చాలా దేశాలు డిమాండ్ చేస్తున్నాయి.