అంతర్జాతీయం

అమెరికా సరిహద్దులో వివాదాస్పద గోడ నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఫిబ్రవరి 23: అమెరికా సరిహద్దులో వివాదాస్పద గోడ నిర్మాణం తప్పకుండా చేపడతామని ఒకపక్క అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతుండగా, మరోపక్క ఆ నిర్మాణం జరగకుండా అడ్డుకుంటామని అందుకు వ్యతిరేకిస్తున్న డెమోక్రాట్లు స్పష్టం చేస్తున్నారు. దేశ సరిహద్దులో గోడ నిర్మాణానికి అవసరమైన నిధుల సేకరణకు ట్రంప్ తనకున్న విశేష అధికారాలను వినియోగించనున్నారు. గోడ నిర్మాణానికి అవసరమైన నిధుల సేకరణపై గత వారం జరిగిన ఒక సమావేశంలో అధ్యక్షుడు స్పష్టమైన ప్రకటన చేశారు. దీనిపై వచ్చే గురువారం సుదీర్ఘమైన చర్చ జరిగే అవకాశం ఉంది. అమెరికా కాంగ్రెస్‌లోని హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి మాట్లాడుతూ దేశాధ్యక్షుడు ట్రంప్ రాజకీయపరంగా, న్యాయపరంగా ఎదురయ్యే సవాళ్లకు దీటుగా ముందుకు సాగనున్నారని పేర్కొన్నారు. ఈ విషయమై ప్రతిపక్ష డెమోక్రాట్ల నుంచి సైతం మద్దతు లభిస్తుందని అధికార పార్టీ రిపబ్లికన్లు యోచిస్తున్నారు. అయితే, దేశాధ్యక్షుడు తనకున్న విశేషాధికారాలను వినియోగించుకుని ఆయా రాష్ట్రాల నిధులను చేజిక్కించుకోవడం ద్వారా తన నిర్ణయాన్ని అమలు చేయాలంటే సాధ్యం కాని పని, ఇందుకు తామంతా పూర్తిగా వ్యతిరేకిస్తామని డెమోక్రాట్లు స్పష్టం చేస్తున్నారు. 2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికల సందర్భంగా తాను అధికారంలోకి వస్తే అమెరికా సరిహద్దుల్లో తప్పకుండా గోడ కడతానని ట్రంప్ పేర్కొన్నారు. ఇపుడు తన నిర్ణయాన్ని అమలు చేయడానికి వీలుగా ఇందుకు 5.7 బిలియన్ డాలర్ల వ్యయం కానుంది. నిధుల కోసం ట్రంప్ తీసుకున్న అసాధారణ నిర్ణయం వల్ల ఇటీవల అమెరికాలో ఆర్థిక ప్రతిష్ఠంభన ఎదురైంది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాన్ని మెజారిటీ రాష్ట్రాలు వ్యతిరేకించినా, నిధుల సేకరణకు ట్రంప్ తనకున్న విశేష అధికారాలను వినియోగించుకునే ప్రయత్నాలను తప్పనిసరిగా తిప్పికొడతామని ప్రతిపక్ష డెమోక్రాట్లు స్పష్టం చేస్తున్నారు.