అంతర్జాతీయం

పాక్‌కు బుద్ధి చెప్పాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, ఫిబ్రవరి 23: జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిపై ప్రపంచ వ్యాప్తంగా నిరసన జ్యాలలు రగులుతునే ఉన్నాయి. జైషే ముష్కరుల మారణకాండను ఐరాస భద్రతామండలి తీవ్రంగా ఖండించింది. పాక్ ప్రేరిత ఉగ్రవాద సంస్థల దాడులకు నిరసనగా అమెరికాలోని ఇండియన్-అమెరికన్లు న్యూయార్క్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇక్కడి పాక్ కాన్సులేట్, ఐరాసలోని పాకిస్తాన్ పర్మినెంట్ మిషన్ ఎదుట నిరసన ప్రదర్శన జరిపారు. పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌పై జరిగిన దాడిని తీవ్రంగా గర్హించారు. పాక్ భూభాగం నుంచే దాడులు జరుగుతున్నాయని వారు తీవ్రంగా మండిపడ్డారు. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ, దాని అధినేత మసూద్ అజార్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. న్యూజెర్సీ, న్యూయార్క్ నుంచి వచ్చిన ఇండో-అమెరికన్లు పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులు చేబూని నినాదాలు ఇచ్చారు. పాకిస్తాన్ కాన్సులేట్, మన్‌హట్టన్‌లోని పాకిస్తాన్ పర్మినెంట్ మిషన్ ఎదుట పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. భారత జాతీయ పతాకం మువ్వనె్నల జెండా, అమెరికా జాతీయ పతాకాలను పట్టుకుని నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. 40 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న జైషే ఉగ్రవాదులను తుదముట్టించాలని అమెరికన్ ఇండియా పబ్లిక్ అఫయిర్స్ కమిటీ చీఫ్ జగదీష్ సెవ్హానీ డిమాండ్ చేశారు. పాక్‌కు గట్టి సందేశాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతోనే తామీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టామని వెల్లడించారు. భారత దళాలను లక్ష్యంగా చేసుకుని పాక్ అండదండలతోనే దాడులకు దిగుతున్నారని ఆయన ఆరోపించారు. 26/11 ముంబయిపై దాడి, పఠాన్‌కోట్, యూరీ ఘటనలను ఆయనీ సందర్భంగా ప్రస్తావించారు. పాక్ దుశ్చర్యను ఐరాస భద్రతా మండలి ఖండించిన విషయాన్ని జగదీష్ గుర్తుచేశారు.